Akshaya Tritiya Lucky Zodiac: అక్షయా తృతీయ రోజు అరుదైన గ్రహ కదలికలు.. ఈ రాశుల వారికి డబ్బుతో పాటు లగ్జరీ లైఫ్..

Akshaya Tritiya Lucky Zodiac 2025 Effect: అక్షయ తృతీయకు రెండు రోజుల ముందుగానే శని గృహస్పతి గ్రహాలు నక్షత్ర సంచారం చేయబోతున్నాయి. దీని ప్రభావం కొన్ని రాశుల వారిపై అక్షయ తృతీయ పండుగ రోజు నుంచి ప్రారంభమవుతుంది. దీనివల్ల  వారు అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు.

Akshaya Tritiya Lucky Zodiac 2025 Effect: ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీన వచ్చింది. అయితే ఈ పండగ రోజున హిందువులంతా లక్ష్మీదేవితో పాటు కుబేరుడుని పూజిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది అయితే బంగారం తో పాటు వెండిని కొనుగోలు  చేస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని హిందువుల నమ్మకం. అయితే అక్షయా తృతీయకు రెండు రోజుల ముందు బృహస్పతి, శని గ్రహాలు నక్షత్ర సంచారం చేయబోతున్నాయి.

1 /6

ఏప్రిల్ 28వ తేదీన బృహస్పతి, శని గ్రహాలు నక్షత్ర సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు గ్రహాలు ఉత్తరాభాద్ర పాద నక్షత్రంలోకి ప్రవేశిస్తాయి. ఈ నక్షత్ర సంచారం వల్ల ఐదు రాశుల వారిపై అద్భుతమైన సానుకూలమైన ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఎఫెక్ట్ వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.

2 /6

ముఖ్యంగా మేష రాశి వారికి అక్షయా తృతీయ నుంచి అంతా మంచే జరుగుతుంది. ఉద్యోగాలు చేస్తున్న ఈ రాశి వారికి అద్భుతమైన బంపర్ ఆఫర్స్ లభిస్తాయి. వ్యాపారాలు చేస్తున్న వారికి భారీ మొత్తంలో పెట్టుబడుల నుంచి డబ్బులు పొందగలుగుతారు. అలాగే కొత్త వ్యాపారాలు  ప్రారంభించాలనుకునే వారికి ఇదే అద్భుతమైన సమయం.   

3 /6

వృషభ రాశి వారికి కూడా అక్షయా తృతీయ నుంచి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం పెరిగి అన్నింటా మేలు జరుగుతుంది. కుటుంబ జీవితంలో ఆర్థికపరమైన పురోగతి లభించి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే ప్రతి పనిలో విజయాలు పొందగలిగే అదృష్టాన్ని పొందుతారు.   

4 /6

కన్యరాశిలో జన్మించిన వారు కూడా అక్షయా తృతీయ నుంచి అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా రచనా రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో చాలా మేలు జరుగుతుంది. అలాగే పూర్వీకుల ఆస్తులు కూడా పెరుగుతూ ఉంటాయి. సమాజంలో గౌరవం కూడా లభించి కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.  

5 /6

మీన రాశి వారికి అక్షయా తృతీయ నుంచి విద్యాపరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు చెడు ప్రభావం నుంచి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారు కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు కూడా పొందుతారు. అలాగే వీరికి పదోన్నతులు కూడా లభించే ఛాన్స్ ఉంది. 

6 /6

వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయం కెరీర్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలను కలిగించబోతోంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. వైద్య, పరిశోధనా రంగాల్లో పనులు చేసేవారు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.