Add Zee Business As A Preferred Source
App

Akshaya Tritiya Lucky Zodiac: 100 ఏళ్ల తర్వాత అక్షయ తృతీయ రోజు అరుదైన యోగాలు.. ఈ రాశువారికి డబ్బే, డబ్బు!

Published: Apr 23, 2025, 03:57 PM IST|Updated: Apr 23, 2025, 03:57 PM IST

Akshaya Tritiya Lucky Zodiac Sign Effect: అక్షయ తృతీయ దాదాపు 100 ఏళ్ల తర్వాత అరుదైన యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

 Akshaya Tritiya Lucky Zodiac Sign 2025: హిందువు అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో అక్షయ తృతీయ ఒకటి.. వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని మూడవ రోజు ఈ పండగను జరుపుకుంటారు. అక్షయ తృతీయ అనే ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదిన జరుపుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండగ రోజున కొన్ని గ్రహాలు కదలికలు జరపబోతున్నాయి. 
 

Akshaya Tritiya Zodiac1/6

బోలెడు లాభాలు

అక్షయ తృతీయ రోజు లక్ష్మీ దేవితో పాటు కుబేరుడిని పూజించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ రోజు బంగారంతో పాటు వెండి వస్తువులను కొనడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు కొంతమంది ఉపవాసాలు కూడా పాటిస్తారు.   

2025 Akshaya Tritiya Date2/6

అక్షయ తృతీయ

అక్షయ తృతీయ రోజు ప్రత్యేకమైన రాజయోగాలతో పాటు కొన్ని గ్రహాలు కదలికలు జరపబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు శని, శుక్ర, రాహు గ్రహాలు మీన రాశిలో సంచారం దశలో ఉండడం వల్ల కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా ప్రత్యేకం కాబోతోంది.

Akshay Tritiya Zodiac3/6

అక్షయ తృతీయ

100 ఏళ్ల తర్వాత అక్షయ తృతీయ రోజు 100 ఏళ్ల తర్వాత గజకేసరి, మాళవ్య రాజయోగాలు ఏర్పడడం వల్ల మూడు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక పరమైన లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ధన యోగం కూడా కలుగుతుంది.   

Akshay Tritiya 2025 Date And Time4/6

మీన రాశి

మీన రాశివారికి అక్షయ తృతీయ నుంచి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఆస్తి పరంగా కలలు కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారికి కోరికలు తీరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు గతంలో నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు కూడా ఉద్యోగాలు చేరుతారు.  

Akshaya Tritiya 2025 Zodiac5/6

వృషభ రాశి 

అక్షయ తృతీయ నుంచి వృషభ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వీరు కెరీర్‌ పరంగా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా చాలా కాలంగా నిలిచిపోచిన పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారు కూడా ఉన్నతాధికారుల నుంచి విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే ప్రధాన బాధ్యతలు కూడా పొందుతారు.   

Akshaya Tritiya 6/6

మిథున రాశి

మిథున రాశివారికి ఈ అక్షయ తృతీయ  బోలెడు లాభాలను అందించబోతోంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో ప్రమోషన్స్‌ కూడా పొందుతారు. దీంతో పాటు తల్లిదండ్రులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. అలాగే ఉద్యోగాల పరంగా కూడా కొత్త అవకాశాలు పొందుతారు. దీంతో పాటు వివిధ పనులు చేసేవారు కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు.