Add Zee Business As A Preferred Source
App

Ramya Moksha: పచ్చళ్ల పాపకు ఊహించని షాక్.. ఈ వారం బిగ్‌బాస్ నుంచి అవుట్..!

Written ByAruna Maharaju
Published: Oct 26, 2025, 04:16 PM IST|Updated: Oct 26, 2025, 04:16 PM IST

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9లో వారానికో ట్విస్ట్ ఇస్తున్నాడు బిగ్ బాస్. ప్రతి వారం కొత్త ట్విస్టులు, ఎలిమినేషన్లతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ముందు నుంచి చెప్తున్నట్టుగా ఈ సీజన్ కాస్త కొత్తగా సాగుతోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ తరువాత ఆ ఎంటర్టైన్మెంట్ ఇంకాస్త ఎక్కువ అయ్యింది. ఆడియన్స్‌ని మాత్రం ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే.. పచ్చళ్ల పాప రమ్య మోక్ష బయటికొచ్చేసినట్లు తెలుస్తోంది.
 

Ramya Moksha Eliminated1/5

బిగ్‌బాస్ నుంచి రమ్య మోక్ష ఎలిమినేట్

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్. ప్రస్తుతం సీజన్ 9 ఏడో వారంలో ఎలిమినేషన్ దశకి చేరింది. ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్‌కి గుడ్‌బై చెప్పారు. గతవారం భరణి ఎలిమినేట్ కాగానే చాలామంది ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఈ వారం ఇప్పటికే ఆయేషా ఎలిమినేట్ అయింది. డీహైడ్రేషన్, జ్వరం లక్షణాలతో ఈమె హౌస్ నుంచి బయటకొచ్చేసింది. కానీ కొన్నిరోజుల తర్వాత తిరిగి హౌసులోకి వెళ్లే అవకాశముంది.   

Ramya Moksha Eliminated2/5

బిగ్‌బాస్ నుంచి రమ్య మోక్ష ఎలిమినేట్

అయితే ఆయేషా బయటకొచ్చేయడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండదేమోనని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేకుండా ఎవరు ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్టు సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఈ వారం నామినేషన్లలో రమ్య, సాయి శ్రీనివాస్, దివ్య, రీతూ, తనూజ, రాము, సంజన, కల్యాణ్ ఉన్నారు.   

Alekhya Chitti Pickles Fame Ramya Moksha3/5

బిగ్‌బాస్ నుంచి రమ్య మోక్ష ఎలిమినేట్

తనూజ టాప్ పొజిషన్‌లో ఉండగా.. తర్వాత స్థానాల్లో కళ్యాణ్, దివ్య, రీతూ, సంజన ఉన్నారు. చివరి మూడు స్థానాల్లో రాము, సాయి, రమ్య ఉన్నారు. ఓటింగ్ పరంగా రమ్యకు అతి తక్కువ మద్దతు రావడంతో.. ఎలిమినేషన్ నిర్ణయం తేలిపోయినట్లు సమాచారం. ఆమె ఎలిమినేషన్ ఎపిసోడ్ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది.   

Bigg Boss Ramya Elimination4/5

బిగ్‌బాస్ నుంచి రమ్య మోక్ష ఎలిమినేట్

వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా హౌస్‌లో అడుగు పెట్టింది రమ్య మోక్ష. సోషల్ మీడియాలో పచ్చళ్ల బిజినెస్‌ ద్వారా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన మొదటి రోజే టాక్ ఆఫ్ ది హౌస్ అయింది. తన వ్యవహార శైలితో వివాదాలకు తెరలేపి పర్సనల్ కామెంట్స్, అటిట్యూడ్ కారణంగా సోషల్ మీడియాలో భారీ వ్యతిరేకత ఎదుర్కొంది.   

Alekhya Chitti Pickles Fame Ramya Moksha5/5

బిగ్‌బాస్ నుంచి రమ్య మోక్ష ఎలిమినేట్

ఫిజికల్ టాస్క్‌లలో మంచి పోటీ చూపించినప్పటికీ, వ్యక్తిగత వ్యాఖ్యలు, తనూజ-కల్యాణ్ రిలేషన్‌పై కామెంట్లు, ఇతర కంటెస్టెంట్లపై విమర్శలు ఆమెకు మైనస్ పాయింట్లుగా మారాయి.