Fake Smartphones Sale: దసరా పండుగ సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో.. సెప్టెంబర్ 23 నుంచి మెగా ఫెస్టివ్ సేల్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఇలా ఆన్‌లైన్ సేల్ నడుస్తున్నప్పుడు ఫేక్ మొబైల్స్ అమ్మేస్తుంటారు. కాబట్టి ఇలాంటి మోసాల పట్ల చాలా అలర్ట్‌గా ఉండాలి. మరి మీరు కొనే ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్.. అసలు ఒరిజినల్ లేదా ఫేక్ అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
1/5సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో పెద్ద ఎత్తున ఫెస్టివల్ సేల్స్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ కానీ, ఐఫోన్ కానీ.. ఈ సేల్స్‌లో మంచి ఆఫర్లతో కొనొచ్చు. కానీ ఆన్‌లైన్‌లో ఫోన్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే కొన్ని సార్లు ఫేక్ ఫోన్‌లను అమ్మే అవకాశం ఉంది.
2/5ఇప్పటికే చాలా మంది కొందరు కొనుగోలుదారులు అసలైన బ్రాండ్-న్యూ ఫోన్లకు బదులుగా ఫేక్, రియింబర్స్‌డ్ లేదా అసలు వర్క్ చేయని ఫోన్లను పొందారని ఫిర్యాదు చేశారు. ఇలాంటి మోసాలను నివారించడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం ఒక సులభమైన మార్గాన్ని అందిస్తోంది. సంచార్ సాథీ పోర్టల్ ద్వారా మీరు కొన్న ఫోన్ ఒరిజినల్ అవునో కాదో తెలుసుకోవచ్చు.
3/5మీ స్మార్ట్‌ఫోన్ అథెంటికేషన్ ఎలా ధృవీకరించాలంటే.. ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు 15 అంకెల IMEI (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ) నంబర్ ఉంటుంది. సంచార్ సాథీ పోర్టల్ ద్వారా ఈ నంబర్‌ను చెక్ చేయాలి. తద్వారా కొనుగోలుదారులు మీరు కొన్న మొబైల్ ఫోన్ ఒరిజినల్ లేదా ఫేక్ అనేది తెలుసుకోవచ్చు.
4/5అధికారిక పోర్టల్ (sancharsaathi.gov.in)ను విజిట్ చేసి.. అందులోని హోమ్‌పేజీలో సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్‌ను ఎంచుకోండి. నో యువర్ మొబైల్ (KYM)/IMEI వెరిఫికేషన్‌పై క్లిక్ చేసి.. OTP కోసం కాప్చా, మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్‌కి వచ్చిన OTP ఎంటర్ చేయండి. మీ స్మార్ట్‌ఫోన్ 15-అంకెల IMEI నంబర్‌ను ఎంటర్ చేసి Submit ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత సిస్టమ్ డివైజ్ స్టేటస్, బ్రాండ్, మోడల్, తయారీదారు, మోడల్ వంటి వివరాలను చూడొచ్చు.
5/5మీరు ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్ వాడుతుంటే.. గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) లేదా ఆపిల్ యాప్ స్టోర్ (Apple App Store) నుంచి Sanchar Saathi యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత మీ ఫోన్ IMEI నంబర్ చూసేందుకు KYM <15-అంకెల IMEI నంబర్> ఫార్మాట్‌లో 14422కు SMS పంపండి లేదా మీ స్మార్ట్‌ఫోన్‌లో *#06# డయల్ చేయండి. పండుగ సేల్స్ సమయంలో ఫోన్ డెలివరీ అయిన వెంటనే.. కొనుగోలుదారులు దాన్ని ధృవీకరించుకోవడం మంచిది. ఇలా చేస్తే మీరు కొన్న ఫోన్ 100 శాతం ఒరిజినల్ అవునో కాదో తెలుసుకోవచ్చు.