Alia Bhatt: షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఆలియా భట్.. ఆ హీరో వల్లే కూతురి ఫోటోలు డిలీట్..?..

alia bhatt decision: బాలీవుడ్ నటి ఆలియా భట్ అన్ని రకాల తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల మీద నుంచి తన కూతురు రాహా ఫోటోలను డిలీట్ చేసింది. దీంతో ప్రస్తుతం బాలీవుడ్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

1 /6

బాలీవుడ్ నటి ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ లు 2021లో ప్రేమించుకుని పెళ్లితో ఒక్కటయ్యారు. వీరికి 2022 లో రాహా పుట్టింది. అయితే.. పెళ్లైన ఏడునెలలకే రాహా జన్మించింది. అప్పట్లో రణ్ బీర్ జంటను నెటిజన్లు తెగ ట్రోల్స్ చేశారు.

2 /6

తాజాగా.. ఆలియా భట్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆలియాభట్ తన కూతురు రాహాతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకున్నారు. అయితే.. తాజాగా మాత్రం.. అన్ని అకౌంట్ ల నుంచి కూతురు రాహా ఉన్న ఫోటోలను డిలీట్ చేశారు.  

3 /6

దీంతో ఈ అంశం ప్రస్తుతం ఇండస్ట్రీలో పెను దుమారంగా మారింది.అసలు.. ఆలియాభట్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని నెటిజన్లు, ఆమె అభిమానులు తెగ కంగారు పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల సైఫ్ అలీఖాన్ , కరీనాలు కూడా తమ బిడ్డల ఫోటోలను తీయకూడదని జాగ్రత్తలు తీసుకున్నారు.

4 /6

ముఖ్యంగా ముంబైలో సైఫ్ పై దాడి జరిగిన తర్వాత పిల్లల్ని ఎక్కడ కూడా కన్పించకుండా.. కొంత మంది సెలబ్రీటీలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఇటీవల కరీనా మీడియాతో  తన పిల్లల ఫోటోలు తీయోద్దని రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.   టాలీవుడ్ విషయానికి వస్తే.. రామ్ చరణ్ దంపతులు సైతం.. తమ కూతురు ఫెస్ ఎక్స్ పోజ్ కాకుండా.. కొన్ని ఏళ్ల పాటు జాగ్రత్తలు తీసుకున్నారు.  ఇటీవల రామ్ చరణ్ తన కూతురు క్లీంకారా ఫెస్ ను రివీల్ చేశారు.

5 /6

ఇంత‌కుముందు స్టార్ క్రికెట‌ర్ అయిన విరాట్ కోహ్లీ – అనుష్కా జంట‌ కూడా త‌మ పిల్ల‌లు వామికా, అకాయ్‌ల‌ను మీడియాకు దూరంగా ఉంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆలియాభట్ తాజాగా.. వీరిని ఫాలో అయ్యినట్లు సమాచారం.  

6 /6

అయితే.. పిల్లల ప్రైవసీని కాపాడాలని నటి ఇలా చేసి ఉండొచ్చని కొంత మంది నెటిజన్ లు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల క్యూట్ నెస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసి సంబర పడిపోతుంటారు. కానీ కొంత మంది నెటిజన్లు కాంట్రవర్సీగా కూడా కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది నెగెటివ్ చూపుతో ఉంటారు.అలాంటి వారికి తమ బిడ్డల్ని దూరంగా ఉంచుకొవాలని ఆలియా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఆలియాభట్ అంశం మాత్రం వార్తలలో నిలిచింది.