Add Zee Business As A Preferred Source
App

Bank Holiday: సెప్టెంబర్‌ 5న దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులు బంద్‌.. ఆర్‌బీఐ ప్రకటన..!

Written ByRenuka Godugu
Published: Sep 02, 2025, 04:30 PM IST|Updated: Sep 02, 2025, 04:30 PM IST

September 5 Bank Holiday: సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు బంద్. ఆర్‌బీఐ ప్రకటన చేసింది. ప్రధానంగా ఆరోజు రెండు పండుగలు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు. ఓనం, మిలాద్ ఉన్‌ నబీ రెండు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సెప్టెంబర్ 5వ తేదీ బ్యాంకులు బంద్ ఉంటాయి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
 

Banks Bandh1/5

బ్యాంకులు బంద్

సాధారణంగా ప్రతి ఆదివారాలతో పాటు రెండో, నాలుగో శనివారాలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు బంద్ ఉంటాయి. ఈసారి సెప్టెంబర్‌ నెలలో 7, 14, 21, 28 ఆదివారాలు రానున్నాయి. ఇక రెండో శనివారం 13, నాలుగో శనివారం 27 తేదీల్లో రానున్నాయి. ఈ రోజుల్లో కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి.  

RBI closed2/5

ఆర్‌బీఐ బంద్

ఇది కాకుండా శుక్రవారం సెప్టెంబర్ 5వ తేదీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు ఆర్‌బీఐ బంద్ ప్రకటించింది. ఆరోజు ఈద్‌ ఉన్‌ నబీ ఇంకా కేరళ అతిపెద్ద పండుగ ఓనం కూడా రానుంది.  

Eid Milad3/5

ఈద్ మిలాద్

ఈద్ మిలాద్ ఉన్‌ నబీ అంటే ముస్లింలు జరుపుకునే ఒక ప్రవక్త జన్మదినం. దీన్నే ఇది ఏ మిలాద్‌గా కూడా జరుపుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో రీతిన ముస్లింలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉన్నాయి. స్కూళ్లకు కూడా ఆరోజు సెలవు ప్రకటించారు.  

Onam Festival4/5

ఓనం పండుగ

ఇక ఆరోజు ఓనం పండుగ కూడా రానుంది. ఇది కేరళలో ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు కూడా బంద్‌. ఈ ఓనం పండుగ సందర్భంగా సెలవు ప్రకటించారు. స్కూళ్లకు కూడా సెలవు ఉంటుంది. ఇక కేరళలో అయితే పది రోజులపాటు వైభవంగా వేడుక నిర్వహిస్తారు.  

Bank Branch5/5

బ్యాంకు బ్రాంచీలు

అయితే, దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు బ్రాంచీలు బంద్‌ ఉంటాయి. కానీ, ఆన్‌లైన్‌ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. ఏటీఎం సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కానీ, పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేయలేం. చెక్‌ క్లియరెన్స్‌ కావాలంటే కూడా బ్యాంకు వెళ్లాల్సిందే. ముందుగానే ఈ విషయం ఖాతాదారులు తెలుసుకోవాలి.