Tomorrow All Banks Closed: రేపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులకు సెలవు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI). అయితే ఎక్కడెక్కడ ఏ బ్రాంచ్ లు బంద్ ఉంటాయి? కారణం ఏంటి? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
1/5బ్యాంకులకు ఆర్‌బీఐ ప్రకారం సెలవులు మంజూరు చేస్తారు. ఇదిలా ఉండగా రేపు 5వ తేదీ ఈద్ ఏ మిలాద్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు బంద్ ఉంటాయి. ఆ రోజు శుక్రవారం అన్ని ప్రధాన నగరాల్లో ముస్లింలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా బంద్ ఉంటాయి.
2/5ఈ నేపథ్యంలో మీకు ఏమైనా బ్యాంకు పనులు ఉంటే ముందుగానే చూసుకోండి. ఈరోజే బ్యాంకు పనులు పూర్తి చేసుకోవడం వల్ల రేపు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక 6వ తేదీ కూడా బ్యాంకులకు బంద్ ఉంటాయి. ఆరోజు గణేష నిమజ్జనం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఇవ్వవచ్చు. ఇప్పటికే స్కూళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు మంజూరు చేశారు.
3/5ఇక తర్వాత 7వ తేదీ ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే ఈద్ ఏ మిలాద్ సందర్భంగా కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వంటి అన్ని ప్రధాన నగరాల్లో బ్యాంకు బ్రాంచీలు బంద్ ఉండనున్నాయి
4/5ఈరోజు ముస్లింల ఈద్ ఏ మిలాద్ పండుగ ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా ఇది జరుపుకుంటారు. ఇది కాకుండా కేరళలో ఓనం పండుగ కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అది కూడా సెప్టెంబర్ 5వ తేదీనే రానుంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
5/5బ్యాంకు బ్రాంచ్ లు బంద్ ఉన్నా కానీ ఆన్‌లైన్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. యూపిఐ, నెఫ్ట్, ఆర్టిజిఎస్, ఏటీఎం సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే పెద్ద మొత్తంలో విత్ డ్రా, డిపాజిట్, చెక్కు క్లియరెన్స్ ఉన్నప్పుడు మాత్రం బ్యాంకుకు వెళ్లాల్సిందే.