Bank Employees To Get Five Days Holidays Here Full Details: దసరా పండుగ ముగిసిన తర్వాత మళ్లీ బ్యాంకులకు భారీ సెలవులు వచ్చేశాయి. అక్టోబర్ రెండో వారంలో మొత్తం 5 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఎప్పుడు, ఎక్కడ? అనే వివరాలు తెలుసుకుందాం.
1/6గత నెల మాదిరి అక్టోబర్ నెలలో కూడా బ్యాంకులకు భారీగా సెలవులు వస్తున్నాయి. వారంలో 5 రోజులు సెలవులు రావడం గమనార్హం. వారాంతం సెలవులతో పాటు పండుగలు.. ప్రత్యేక సెలవులు లభిస్తున్నాయి. ఆ సెలవులు ఎప్పుడూ.. ఎక్కడ అనేవి తెలుసుకుందాం.
2/6అక్టోబర్ నెలకు పండుగల మాసం లేదా సెలవుల నెలగా పేర్కొంటారు. ఎందుకీ నెలలో అందరికీ పెద్ద ఎత్తున సెలవులు లభిస్తుంటాయి. ఈ నెలలో ఇప్పటికే తొలి వారం ముగిసిపోగా రెండో వారం వచ్చింది. మొదటి వారం దసరా పండుగతో ప్రారంభమగా.. రెండో వారంలో కూడా ప్రత్యేక పండుగలు, దినోత్సవాలు ఉన్నాయి. మొత్తం 5 రోజుల సెలవులు వచ్చాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
3/6వారం ప్రారంభ రోజే అంటే సోమవారం అక్టోబర్ 6వ తేదీన బ్యాంకులకు సెలవు ఉండనుంది. లక్ష్మీ పూజ పురస్కరించుకుని బ్యాంకులకు సెలవు వచ్చింది. అయితే ఈ సెలవు దేశవ్యాప్తంగా కాకుండా కేవలం అగర్తలా, కలకత్తా నగరాల్లో ఉన్న బ్యాంకులకు మాత్రమే సెలవు ఇచ్చారు. ఈ విషయాన్ని గ్రహించాల్సి ఉంది.
4/6వారంలో రెండో రోజు అక్టోబర్ 7వ తేదీ మంగళవారం రోజు బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఈ సెలవు అన్నీ రాష్ట్రాల్లో లేదు. మహర్షి వాల్మీకి జయంతితో పాటు కుమార్ పూర్ణిమ వచ్చింది. ఈ రెండు ఉత్సవాల , పర్వదినం సందర్భంగా బెంగళూరు, చండీగఢ్, షిమ్లా, భువనేశ్వర్ నగరాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ఈరోజు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు అందుకే బ్యాంకులకు సెలవు ఇచ్చారు.
5/6ఈ వారంలో అత్యధికంగా వరుసగా మూడు సెలవులు వస్తున్నాయి. అక్టోబర్ 10 శుక్రవారం కర్వా చౌత్ అనే పర్వదినం ఉంది. ఈ సందర్భంగా పలు చోట్ల బ్యాంకులకు సెలవు ఇచ్చారు. సిమ్లా నగరంలో కర్వా చౌత్ పురస్కరించుకుని బ్యాంకులకు సెలవు ప్రకటించారు. రెండో శనివారం, ఆదివారంతో కలిపితే సిమ్లాలో వరుసగా మూడు సెలవులు వస్తున్నాయి.
6/6అక్టోబర్ రెండో వారంలో వారాంతపు సెలవులు యథావిధిగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అక్టోబర్ 11న రెండో శనివారం, 12వ తేదీన ఆదివారం సెలవులు ఉన్నాయి.