Allu Arjun: పేరు మార్చుకోబోతున్న అల్లు అర్జున్.. కొత్త పేరు ఏమిటంటే..?

Allu Arjun name change: పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టేటస్ అందుకున్నారు..అల్లు అర్జున్. ఈ సినిమా అప్పుడు కొన్ని పోలీస్ కేసుల వల్ల ఈయన పర్సనల్ లైఫ్ సతమతమైన..ప్రొఫెషనల్ లైఫ్ లో మాత్రం బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది.

1 /5

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి.. ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. పుష్ప 2 విజయం తర్వాత, బన్నీ తన పేరు మారుస్తున్నాడనే ఊహాగానాలు స్ప్రెడ్ అవుతున్నాయి.

2 /5

న్యూమరాలజీ ప్రకారం, తన పేరులో అదనంగా “U”, “N” అక్షరాలను జోడించాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మార్పు వల్ల కెరీర్ మరింత ప్రభావవంతంగా మారుతుందనే విశ్వాసం ఉన్నట్టు చెబుతున్నారు.  దీంతో అల్లు అర్జున్ కొత్త పేరు కాస్త..’Allu Arjuunn’ గా మారనుందంట.

3 /5

అల్లు అర్జున్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్‌తో ఓ భారీ సినిమా, అలాగే అట్లీ దర్శకత్వంలో మరో బిగ్ బడ్జెట్ మూవీ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించేలా ఉండనున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా మైతాలజీ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని సమాచారం.  

4 /5

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోయే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐదు హీరోయిన్లు ఉండబోతున్నారని, జాన్వీ కపూర్ ప్రధాన హీరోయిన్‌గా నటించనున్నట్టు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కనుంది. 

5 /5

ఇక ఈ క్రమంలోనే..అల్లు అర్జున్ పేరు మారుస్తాడనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నా, దీనిపై ఇప్పటివరకు బన్నీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తలపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. పేరును మార్చినా, మారకపోయినా బన్నీ సినిమాలు మాత్రం ఎప్పుడూ అద్భుతమైన విజయాలు సాధిస్తాయనే నమ్మకంతో ఉన్నారు.