Pawan Kalyan and Allu Arjun: ఎన్నాళ్లకెన్నాళ్లకు..!. పవన్ ఇంటికి బన్నీ... ఆనందంలో అభిమానులు..

Allu Arjun meets with Pawan kalyan: అల్లు అర్జున్ చాలా ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా  కొన్నేళ్లుగా మెగా వర్సెస్ అల్లు వివాదం రూమర్స్ వేళ ఈ భేటీ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
 

1 /6

కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వివాదం పీక్స్ కు వెళ్లిన విషయం తెలిసిందే.  ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అల్లు అర్జున్ తన ఫ్రెండ్ శిల్పారవీచంద్ర కిషోర్ రెడ్డి తరపున నంద్యాలకు వెళ్లి మరీ ప్రచారం నిర్వహించారు.  అప్పటి నుంచి వివాదం క్రమక్రమంగా పెరుగుతు వచ్చింది.  

2 /6

ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు సైతం ఇండైరెక్ట్ గా సెటైరికల్ గా సోషల్ మీడియాలో పోస్టులు సైతం పెట్టారు.ఈ క్రమంలో అప్పటి నుంచి వీరి మధ్య  వివాదం పీక్స్ కు చేరిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మరోవైపు సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ లు ఒకరిపై మరోకరు సెటైర్ లు వేసుకుంటూ గొడవలకు కూడా దిగారు.  మరోవైపు అల్లు అర్జున్ పుష్ప2 రిలీజ్ నేపథ్యంలో.. జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ ను వెళ్లి పరామర్శించారు.. ఆ తర్వాత బన్నీ తన సతీమణితో కలిసి మెగాస్టార్ ఇంటికి సైతం వెళ్లారు. 

3 /6

అయితే.. ఆ తర్వాత కొద్ది రోజులు వీళ్ల మధ్య మరల బాండింగ్ స్ట్రాంగ్ అయిందన్న క్రమంలో మరల ఏదో గ్యాప్ ఉందని ప్రచారం  జరిగింది. పవన్ కళ్యాన్ బన్నీని మాత్రం అసలు కలవలేదు. అల్లు అర్జున్ పవన్ ను కలిసేందుకు ప్రయత్నించిన కూడా పవన్ పెద్దగా ఇష్టపడలేదని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.  

4 /6

ఇటీవల బన్నీ బర్త్ డే వేళ మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా విష్ చేయలేదు. ఇదంతా పక్కన పెడితే.. మరోసారి మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ తన సతీమణి స్నేహరెడ్దితో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఇటీవల  సింగపూర్ లో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.  

5 /6

ఈ నేపథ్యంలో మార్క్ శంకర్ ను చూసేందుకు బన్నీ దంపతులు పవన్ ఇంటికి వెళ్లారు.  మార్క్ శంకర్ ను చూసి అల్లు అర్జున్ దంపతులు ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. అయితే.. మొత్తంగా కొన్నేళ్ల నుంచి పవన్ ను కలవని బన్నీ.. మార్క్ శంకర్  గురించి కలవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.  

6 /6

ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాటల తూటాలు పేల్చుకుంటున్న అల్లు వర్సెస్ మెగా అభిమానులకు కొంత మంది సెటైర్ లు వేస్తున్నారు. వాళ్ల కుటుంబాల్లో ఎలాంటి గ్యాప్ లేదని.. మీరు అనవసరంగా లేనీ పోనీ రూమర్స్ క్రియేట్ చేసి బకరాలు అవుతున్నారని కూడా కొంత మంది నెటిజన్లు ఫ్యాన్స్ పై మండిపడుతున్నారు. మొత్తంగా బన్నీ ఫ్యామిలీ.. పవన్ ఇంటికి వెళ్లి మార్క్ శంకర్ ను చూడటం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.