Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఆస్తులు వింటే వామ్మో అంటారు.. ఆమె తండ్రి కూడా అంతే!
అల్లు అర్జున్ మామ: అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఆయన నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటో తెలుసుకుందాం.
ఆయన ఎవరు: అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాతోపాటు ప్రజల్లో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ నేత: అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అతడు గతంలో బీఆర్‌ఎస్ పార్టీలో పని చేశారు.
ఆస్తులు: అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి ఆర్థికంగా స్థితిమంతురాలు. ఆమె కొన్ని కోట్ల ఆస్తులకు యజమాని. స్నేహారెడ్డి విజయవంతమైన వ్యాపారవేత్త. విద్య, సాంకేతిక రంగాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. స్నేహారెడ్డి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు.
తొలిసారి అక్కడే: స్నేహా రెడ్డి, అల్లు అర్జున్ ఇద్దరూ ఒక వివాహంలో కలుసుకున్నారు. అక్కడ స్నేహను చూడగానే అల్లు అర్జున్ ప్రేమలో పడ్డాడు. క్రమంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది.
ప్రేమ, వివాహం: అల్లు అర్జున్, స్నేహ నిశ్చితార్థం 2010లో జరగ్గా.. 2011లో వివాహమైంది. ఈ దంపతులకు కుమారుడు అయాన్, కుమార్తె అర్హ ఉన్నారు.
అన్ని వ్యవహారాలు: అల్లు స్నేహారెడ్డి వ్యాపార నిర్వహణతో పాటు, కుటుంబ వ్యవహారాలు చూసుకుంటున్నారు.
విద్యా వ్యాపారం: కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్‌లోని సైంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సిట్) అధ్యక్షుడు. ఆయన కూడా కొంతకాలం క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడిగా కొనసాగుతున్నారు. అల్లు అరెస్ట్ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
స్నేహారెడ్డి ఆస్తులు: అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డికి రూ.42 కోట్ల ఆస్తులు ఉన్నాయని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.