Allu Sirish Fiancee Nayanika Reddy: త్వరలో అల్లు వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టేటస్‌కు శుభం కార్డు వేసిన అల్లు శిరీష్.. త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. నయనిక రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు రీసెంట్‌గా అల్లు శిరీష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శిరీష్‌కి కాబోయే భార్య గురించి ప్రస్తుతం నెట్టింటా చర్చ జరుగుతోంది.
1/5అల్లు ఫ్యామిలిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న అల్లు శిరీష్.. త్వరలో నయనిక రెడ్డి అనే అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోబోతున్నట్టు.. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నట్టు ఓ పోస్ట్‌తో తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.
2/5అయితే శిరీష్ కేవలం తనకు కాబోయే వైఫ్ పేరు మాత్రమే చెప్పాడు. ఫొటోలో కూడా అమ్మాయి చేయి పట్టుకొని కేవలం చేతులే కనపడేలా ఓ ఫోటో షేర్ చేశాడు. ఫియాన్సీ ఫేస్ మాత్రం చూపించలేదు శిరీష్. దీంతో అసలు అల్లు శిరీష్ చేసుకోబోయే నయనిక ఎవరు అని అంతా చర్చించుకుంటున్నారు.
3/5అల్లు ఫ్యామిలీ సన్నిహితుల సమాచారం ప్రకారం నయనిక తండ్రి రియల్ ఎస్టేట్, కనస్ట్రక్షన్ బిజినెస్‌లో ఉన్నారని సమాచారం. అలాగే అల్లు శిరీష్ ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా నయనిక పరిచయం అయిందని.. ఆల్మోస్ట్ గత రెండేళ్లుగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది.
4/5అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి లాగే నయనిక కూడా అదే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. రెండేళ్ల లవ్ జర్నీ, అసలు నయనిక రెడ్డి ఎవరనే విషయాలు ఎక్కడా కూడా బయటపడకుండా.. ఎవరికీ తెలియకుండా బాగానే మెయింటైన్ చేశాడు శిరీష్.
5/5మరి ఈ ప్రేమ జంట ఎప్పుడు కొత్త జంటగా మారుతుందో చూడాలి. పెళ్లి సమయానికి అయినా ఆ అమ్మాయి ఎవరో చూపించి ఆమె సోషల్ మీడియా అకౌంట్.. అల్లు శిరీష్ ట్యాగ్ చేస్తాడేమో చూడాలి.