Allu Sirish Marriage With Nayanika: ఇటీవల తీవ్ర విషాదం నిండిన అల్లు కుటుంబంలో శుభకార్యం జరగనుంది. సుదీర్ఘకాలంగా బ్యాచిలర్‌గా ఉన్న అల్లు శిరీష్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు. అతడి పెళ్లి విషయాలను వెల్లడించాడు.
1/6సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబం అల్లు వారి చిన్న వారసుడు అల్లు శిరీష్ ఎట్టకేలకు వివాహం చేసుకోబోతున్నాడు. 38 ఏళ్ల శిరీష్ తన నాన్నమ్మ కోరిక మేరకు వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. తన నానమ్మ లేకున్నా ఆమె ఆశీర్వాదం ఉంటుందని తెలిపాడు.
2/6ఇటీవల అల్లు అరవింద్ తల్లి, శిరీష్ నాన్నమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అల్లు శిరీష్ తన పెళ్లి వార్తను ప్రకటించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన పెళ్లి విషయాన్ని చెబుతూ రెండు ఫొటోలు పంచుకున్నాడు.
3/6నయనిక అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు అల్లు శిరీష్ తెలిపాడు. తనతో అక్టోబర్ 30వ తేదీన నిశ్చితార్థం చేసుకోనున్నట్లు చెప్పాడు. అయితే నయనిక ఎవరో అనే విషయాన్ని మాత్రం అల్లు శిరీష్ తెలపలేదు.
4/6'మా తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా మనసుకు సంబంధించిన ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. నయనికతో అక్టోబర్ 31వ తేదీన నిశ్చితార్థం జరగనుంది. ఇటీవల చనిపోయిన మా నానమ్మ పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ కోరుకునేది. ఇప్పుడు ఆమె లేకపోయినా పైనుంచి ఆశీర్వదాలు కచ్చితంగా ఇస్తుందని భావిస్తున్నా' అని శిరీష్ పోస్ట్ పెట్టాడు.
5/6అల్లు అరవింద్ తనయుడిగా.. అల్లు అర్జున్ సోదరుడిగా శిరీష్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. 'గౌరవం' సినిమాతో హీరోగా పరిచయమైన శిరీష్.. 'కొత్త జంట', 'శ్రీరస్తు శుభమస్తు', 'ఒక్క క్షణం', 'ఏబీసీడీ', 'ఊర్వశివో రాక్షసివో', 'బడ్డీ' అనే సినిమాలు చేశాడు. సినిమాలు చేస్తున్నా కూడా ఒక్క విజయం అందుకోలేకపోవడంతో ఇటీవల సినిమాలకు శిరీష్ దూరమయ్యాడు.
6/6సినిమాలకు దూరమైన అల్లు శిరీష్ వ్యక్తిగత పనులతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు అక్టోబర్ 30వ తేదీన నిశ్చితార్థం చేసుకుని.. డిసెంబర్‌లో వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.