Aloe Vera for Wrinkles: మొహం పైన ముడతలు లేకపోతే కంటి కింద నలుపు అనేది ప్రస్తుత తరం వారికి.. వాళ్ల వాళ్ల జీవనశైలి వల్ల.. ఎక్కువైపోతే ఉంది. ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలి అంటే కొన్ని ఇంటి దగ్గరే చేసుకునే చిట్కాలు తెలిసి పెట్టుకోవడం ఎంతో మంచిది.. మరి అలాంటి ఒక చిట్కాని ఈరోజు చూద్దాం..
1/5ఎక్కువసేపు మొబైల్ ఫోన్లో చూడటం వల్ల అలానే ఎక్కువ సేపు లాప్టాప్ ముందర కూర్చోవడం వల్ల.. మరోపక్క ఎక్కువగా బయట ఫుడ్ తినడం వల్ల.. ఈ తరం వారికి మొహం పైన ముసలితనం అనేది చిన్న వయసులోనే వచ్చేస్తోంది.
2/5ముఖ్యంగా కళ్ళ కింద నలుపు అలానే మొహం పైన.. ముడతలు.. ఎక్కువైపోతున్నాయి. వీటిని తప్పించుకోవాలంటే ప్రతిసారి బ్యూటీ పార్లర్కి వెళ్లి కెమికల్స్ అప్లై చేసుకోవడం మంచిది కాదు…
3/5అందుకే ఇంటిలోనే మనం పాటించగలిగే చిన్ని చిక్కని ఈరోజు చూద్దాం. వీటి కోసం మనకు కావలసిందల్లా అలోవెరా జెల్ మాత్రమే. అలోవెరా చెట్టు నుంచి జెల్ తీసుకుని దాన్ని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి.. అందులోనే కొద్దిగా రోజ్ వాటర్.. లేకపోతే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి.
4/5ఇప్పుడు వీటిని ఐస్ ట్రే లో పోసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. అవి ఐస్ క్యూబ్స్ లాగా మారుతాయి. ఆ తరువాత ఈ ఐస్ క్యూబ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.
5/5ఈ ఐస్ క్యూబ్ ని.. కళ్ళ కింద అలానే మొహం పైన ముడతలు ఉన్న దగ్గర అప్లై చేసుకుని.. ఒక గంట తరువాత గోరువెచ్చటి నీళ్లతో మొహం కడుక్కుంటే.. మొహంలో మంచి గ్లో రావడం ఖాయం.