Actress Amala Paul: హీరోయిన్ అమలాపాల్ తన భర్త, ఫ్యామిలీతో కలిసి ఓనం పండగను జరుపుకుంది. ఓనం సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. కొడుకు, భర్త జగత్ దేశాయ్, ఫ్యామిలీతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
1/6సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ అమలాపాల్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో.. పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.
2/6అల్లు అర్జున్, రామ్ చరణ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తెలుగులో చేసిన సినిమాలు సూపర్ హిట్ కాగా.. ఈ అమ్మడుకి టాలీవుడ్‌లో ఆఫర్స్ మాత్రం రాలేదు. దీంతో పూర్తిగా తమిళం, మలయాళం చిత్రాలకే పరిమితమైపోయింది.
3/6అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న టైమ్‌లోనే కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం ఎక్కువ రోజులు సాగలేదు. పెళ్లైన మూడేళ్లకే వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వగా.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అలరించింది.
4/62023లో జగత్ దేశాయ్ అనే వ్యక్తిని అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈ జంటకు బాబు పుట్టాడు. అమలాపాల్ కొడుకు పేరు ఇళయ్.
5/6తాజాగా ఓనం పండగ సందర్భంగా అభిమానులకు విషెస్ తెలియజేస్తూ.. కొడుకు, భర్త జగత్ దేశాయ్, ఫ్యామిలీతో దిగిన క్యూట్ ఫోటోలను షేర్ చేసింది అమలాపాల్. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. అమలాపాల్ కొడుకు చూడముచ్చటగా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
6/6ఇక హీరోయిన్ అమలపాల్ చివరిసారిగా పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు బ్లెస్సీ కాంబోలో వచ్చిన ఆడుజీవితంలో కనిపించింది.