Amalaki Ekadashi remedies 2025: అమలకీ ఏకాదశి అనేది విష్ణు భగవానుడికి చాలా ఇష్టమైన తిథి అని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆరోజును కొన్ని పరిహారాలు పాటిస్తే జీవితంలో వెనక్కు తిరిగి చూసుకొవాల్సిన అవసరం ఉండదని చెప్తున్నారు.
సాధారణంగా మనకు ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తుంటాయి. నెలకు రెండు ఏకాదశి తిథులు.. అది శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి తిథి వస్తుంది.ఈ రోజున విష్ణుభగవానుడ్ని ఆరాధిస్తే ఆయన దయ వల్ల సిరిసంపదలకు లోటు ఉండదని పండితులు చెబుతుంటారు.
ఈసారి అమలకీ ఏకాదశి తిథిని మనం మార్చి 10న జరుపుకోబోతున్నాం. అంటే మార్చి పదిన సూర్యోదయం వేళ ఏకాదశితిథి ఉంది. ఈరోజున శుభ సమయం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు ఉంది.ఈ కాలంలో ముఖ్యంగా చేయాల్సిన ముఖ్యమైన పనుల్ని పండితులు సూచించారు.
అమలకీ ఏకాదశి రోజున సూర్యోదయంకంటే ముందే నిద్రలేవాలి. ఆతర్వాత దైనందీక కార్యకలాపాలు పూర్తి చేసుకుని.. శుభ్రమైన దుస్తులు ధరించుకుని దేవుడి దగ్గర దీపారాధన చేయాలి. ఏకాదశి అంటే శ్రీమన్నారయణుడికి ఇష్టమైన తిథి. ఈరోజున విష్ణు దేవాలయానికివెళ్లి అనేక పూలను, పండ్లను సమర్పించుకొవాలి.
విష్ణు భగవానుడు అలంకార ప్రియుడు. అందుకే దేవుడి ఆలయంలోకి వెళ్లి దేవుడి అలంకరణకు కావాల్సిన పూలను, దీపాలను సమర్పించుకొవాలి. అమలకి ఏకాదశి అనేది ఉసిరికాయతో ముడిపడి ఉంది. ఈరోజున ఉసిరికాయను దానం చేసిన వారికి జీవితంలో ఎల్లప్పుడు కూడా ధనంకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు.
ఈ ఏకాధశి రోజున శ్రాధ్దకర్మాదికాలు చేస్తే.. వారికి మోక్షం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. అందుకే ఈరోజున ఉపవాసాలు, మౌనవ్రతం చేస్తే ఆకస్మిక ధనలాభం, ఆగిపోయిన పనులు పూర్తవుతాయని పండితులు సూచిస్తున్నారు. అదే విధంగా ప్రస్తుతం ఎండాకాలం స్టార్ట్ అయ్యింది. కాబట్టి పేదవాళ్లకు చల్లని కుండదానం, రోడ్ల మీద నీటి వసతులు ఏర్పాటు చేస్తే చాలా పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు.