Fitness Coach Tips: మనకు సినిమాల్లో కనిపించే నటులు ఎప్పుడూ ఫిట్‌గా, ఎనర్జీగా ఉంటారు. కానీ ఆ ఫిట్‌నెస్ కేవలం అదృష్టం కాదు.. ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ వినోద్ చన్నా తాజాగా సీక్రెట్స్ బయట పెట్టారు. ఈయన అనంత్ అంబానీ..నీతా అంబానీకి కూడా ట్రైనర్ గా వ్యవహరిస్తారు.
1/6అనంత్ అంబానీ..నీతా అంబానీకి ఫిట్నెస్ కోచ్ అయినటువంటి వినోద్ తాజాగా సెలబ్రిటీలు బరువు మైంటైన్ చేయడానికి గల సీక్రెట్స్ బయట పెట్టారు. ఆయాన మాట్లాడుతూ “సెలబ్రిటీలు బరువు మెయింటైన్ చేయదమనేది లక్ కాదు, స్ట్రాటజీ, డిసిప్లిన్, క్రమబద్ధమైన కృషి ఫలితం” అని చెప్పారు. ఆయన చెప్పిన 5 ముఖ్యమైన సీక్రెట్స్ ఇవే.
2/6వినోద్ చన్నా ప్రకారం.. స్టార్‌లు రోజూ క్రమంగా వ్యాయామం చేస్తారు. ఒకరోజు చేసి.. ఒకరోజు మానేయడం కాదు. వారంలో 5–6 రోజులు రెగ్యులర్‌గా వర్కౌట్ చేస్తూ శరీరాన్ని కంట్రోల్‌లో ఉంచుతారు.
3/6ప్రతి సినిమా మొదలయ్యే ముందు 4 నుంచి 6 నెలల ముందు నుంచే వ్యాయామం, డైట్ ప్లాన్ మొదలుపెడతారు. సినిమా పాత్రకు తగ్గ శరీరాకృతి పొందేందుకు ముందుగానే ప్రిపరేషన్ చేస్తారు. ఉదాహరణకు, మసిల్ రోల్ అయితే ప్రోటీన్ డైట్, స్లిమ్ రోల్ అయితే కార్బ్స్ తగ్గిస్తారు.
4/6సినీ నటులు ఏం తింటారన్నది చాలా ముఖ్యమైన విషయం. వారి డైట్‌లో తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్..కూరగాయలు, పండ్లు ఉంటాయి. షూటింగ్ ఎంత బిజీగా ఉన్నా కూడా భోజనం టైంలోనే చేస్తారు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటారు.
5/6వీళ్లకు టైం చాలా తక్కువగా ఉంటుంది. కానీ అవకాశం దొరికినప్పుడల్లా జిమ్ లేదా హోటల్ గదిలోనైనా వర్కౌట్ చేస్తారు. ఎప్పుడు వ్యాయామం చేయలేకపోయినా..చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ ఫిట్‌గా ఉంటారు.
6/6అతిగా కష్టపడటం కాదు, క్రమం తప్పకుండా చిన్న వ్యాయామాలు.. చేయడం ముఖ్యం అంటారు వినోద్ చన్నా. రోజూ కొంత సమయం శరీరానికి కేటాయిస్తే దీర్ఘకాలం ఫిట్‌గా ఉండవచ్చు. మొత్తానికి, స్టార్‌ల ఫిట్‌నెస్ వెనుక మంత్రం క్రమశిక్షణ, క్రమబద్ధమైన ఆహారం, మరియు నిరంతర కృషి. ఒకరోజు కాదు.. సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా సాధన చేస్తేనే ఆరోగ్యకరమైన శరీరం పొందగలుగుతామని వినోద్ చన్నా చెప్పారు.