Add Zee Business As A Preferred Source
App

Anasuya Husband: ‘గుడ్ లుకింగ్ అబ్బాయిలను కలవడం ఇష్టం ఉండదు.. ఆయన చేతకాని వాడు అంటూ..’భర్త గురించి అనసూయ షాకింగ్ కామెంట్స్..

Written ByVishnupriya
Published: Sep 02, 2025, 04:20 PM IST|Updated: Sep 02, 2025, 04:20 PM IST

Anasuya About Husband : బుల్లితెరపై తనేంటో రుజువు చేసుకున్న యాంకర్ అనసూయ. ఆ తర్వాత వెండితెరపై కూడా మెరిసి.. తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకుంది.. ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టేటస్ అందుకుంది. ఈ క్రమంలో తాజాగా అనసూయ తన భర్త గురించి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి…

Anasuya Shocking Comments1/5

అనసూయ

జబర్దస్త్ షో తో తనకంటూ ఎంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ.. ఆ తరువాత సినిమాల్లో సైతం నటించి ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది.  

Anasuya Career2/5

అనసూయ

ఒక రకంగా టీవీ షోలో యాంకర్లు సైతం గ్లామరస్ డ్రెస్సులు వేసుకుంటారు అనేది అనసూయ నుంచే మొదలైంది. ఇక సినిమాల్లోకి అనసూయ అడుగుపెట్టింది కూడా విన్నర్ అనే సినిమా ఐటమ్ సాంగ్ తోనే. ఆ తర్వాత కొన్ని సినిమాలలో కీలకపాత్రలో కనిపించింది. 

Anasuya Interview 3/5

అనసూయ

అనసూయ కి పెళ్లి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అనసూయ ఈ మధ్య తన భర్త గురించి మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.”నా మధ్య మా ఆయన మధ్య కూడా చాలా సార్లు గొడవలు జరిగాయి . నేను కొంతమందిని కలవడం ఆయనకు ఇష్టం ఉండదు. నేను పెద్ద స్టార్ హీరోలతో అలానే గుడ్ లుకింగ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన చాలా ఫీలయ్యేవాడు . అది అబ్బాయిల మనస్తత్వమే,” అంటూ చెప్పుకొచ్చింది..

Anasuya Husband4/5

అనసూయ

“చాలామంది మా ఆయన అన్నీ చేయిస్తారు అలానే నేనేం చేసినా ఒప్పుకుంటారు అంటూ ఉంటారు. మరి కొంతమంది మా ఆయన చేతకాని వాడు అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. అదృష్టం ఏమిటి అంటే మా ఆయనకి తెలుగు రాదు. అందుకే సోషల్ మీడియాలో.. కామెంట్లు పట్టించుకోడు. ఆయనలాగా ఉండాలని నేను ఎన్నోసార్లు అనుకుంటాను,” అంటూ తెలిపింది. 

Anusuya Differences With Husband 5/5

అనసూయ

ఇక సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రేక్షకులు అనసూయని ఎప్పుడూ ఏదో ఒక కామెంట్స్ చేస్తూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక వాళ్లకి అనసూయ కూడా అంతే ఘాటుగా.. సమాధానం ఇస్తూ ఉంటుంది.