Anchor Suma
ప్రముఖ యాంకర్ సుమ కనకాల సీరియల్స్ లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఒక ఫేమస్ సీరియల్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఆ సీరియల్ లో సుమా చేసిన క్యారెక్టర్ కూడా అందరిని ఆశ్చర్యపరుస్తుంది.. ఇంతకీ ఆ సీరియల్ ఏమిటి అనే విషయానికి వెళితే..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు పలు చిత్రాలలో నటిగా కెరియర్ను కొనసాగించి.. ఆ తర్వాత బుల్లితెరపై అడుగులు వేసిన ఈమె.. ఇక్కడ తన అద్భుతమైన వాక్చాతుర్యంతో యాంకర్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
ముఖ్యంగా షో ఏదైనా సరే.. ఈవెంట్ ఏదైనా సరే.. సుమ ఉండాల్సిందే. అటు పెద్ద పెద్ద హీరోలు, దర్శకులు కూడా సుమా తమ ఈవెంట్ కు రావాలి అని హోస్ట్గా చేయాలి అని అందరూ ఆరాటపడేవారే.
అంతెందుకు ఇటీవల ఏడాదిగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కి కూడా సుమా హోస్టుగా చేసి ఈవెంట్ను సక్సెస్ చేసింది..
ఇక టాలీవుడ్ మొదలుకొని ఈమధ్య బాలీవుడ్ వరకు సుమా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఈమె గతంలో నటించిన సీరియల్స్ కి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అందులో భాగంగానే గతంలో అన్వేషణ అనే ఒక దెయ్యం సీరియల్ లో సుమ నటించగా.. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇది చూసిన నెటిజన్స్ సుమాలో ఏ మాత్రం మార్పు రాలేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సుమ ఒకవైపు హోస్ట్ గా చేస్తూనే మరొకవైపు సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.
ఇక తాజాగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ లో భాగంగా పలువురు దేశవ్యాప్తంగా అత్యుత్తమ ప్రథమ కనపరిచిన వారికి అందిస్తున్న అవార్డుల వేడుకలో కూడా సుమా హోస్టుగా వ్యవహరిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.