Bigg boss fame vishnu priya on Venu Swamy: ఫెమస్ యాంకర్ విష్ణు ప్రియ కాంట్రవర్సీ జ్యోతిష్యుడు వేణుస్వామిపై చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల వేణు స్వామి ప్రగతి పతకాలు గెల్చుకొవడం తన క్రెడిటే అంటూ వ్యాఖ్యలుచేసిన విషయం తెలిసిందే.
1/5కాంట్రవర్సీ జ్యోతిష్యుడు వేణు స్వామి తరచుగా వార్తలలో ఉంటునే ఉంటారు. ఇటీవల సమంత రెండో పెళ్లిపై కూడా వేణు స్వామి సంచలన వ్యాఖ్యలుచేశారు. అంతేకాకుండా అసలు భూత శుద్ది వివాహం ఉండదని, లింగ భైరవీ మాత కూడా ఉండదని అన్నారు. అంతటితో ఆగకుండా ఇటీవల నటి ప్రగతి నాలుగు పతకాలను గెల్చుకుంది.దీనిపై వేణుస్వామిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రగతి ఏకంగా నాలుగు పతకాలు గెల్చుకొవడం వెనుకతనపూజల ఫలితాలే ఉన్నాయన్నారు. అంతేకాకుండా తనను కొంతమంది కావాలని తనవ్యాఖ్యల్ని ట్రోల్స్ చేసి కాంట్రవర్సీగా రాజేయాలని చూస్తున్నారన్నారు. వీటికి కాలం సరైన సమాధానం చెప్తుందన్నారు.
2/5అయితే వేణు స్వామిని తరచుగా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా.. యాంకర్, బిగ్ బాస్ ఫెస్ ఫెమ్ విష్ణు ప్రియ మాత్రం వేణుస్వామిపై ప్రశంసలు కురిపించారు. యాంకర్ విష్ణు ప్రియ సుడిగాలి సుధీర్ తో పోవే పోరా గేమ్ షోతో పాపులారిటీ సంపాదించుకుంది. ఆతర్వాత పలు మూవీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.
3/5బిగ్ బాస్ తో కూడా మంచి ఫెమ్ సంపాదించుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కష్టకాలంలో వేణు స్వామి చేసిన సహాయాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యింది. వేణుస్వామి సాయం వల్లే తన తల్లి ఎక్కువ రోజులు బ్రతకగలిగిందని ఆమె తెలిపింది.
4/5గతంలో ఒకసారి వేణుస్వామికి తన తల్లికి అనారోగ్యం ఉందని ఆస్పత్రి బిల్లులు లక్షల్లో పెరిగిపోయాయని విష్ణు ప్రియ తెలిపారు. అప్పుడు ఏంచేయాలో అర్థం కాక ఎటుపాలుపోలేని స్థితిలో వేణు స్వామికి ఫోన్ చేసి డబ్బుల్ని అడిగానని చెప్పారు. ఆయన వెంటనే రియాక్ట్ అయి డబ్బు సర్దుబాటు చేశారని చెప్పారు. ఆ సమయంలో డాక్టర్లు మూడు రోజులే బతుకుతారని చెప్పినా, వేణు స్వామి చేసిన ఆ సహాయం వల్లే మా అమ్మ మరో ఏడాది పాటు జీవించారని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అంతే కాకుండా వేణుస్వామిపై ప్రశంసలు కురిపించారు.
5/5అంతేకాకుండా.. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి అంగీకరించకపోతే సన్యాసంకు కూడా సిద్దమేనన్నారు. గతంలో మార్ఫింగ్ లలో వేధింపులకు గురై, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొవాలని ఆలోచనలువచ్చాయన్నారు. మొత్తంగా విష్ణు ప్రియ వేణుస్వామిపై చేసిన ప్రశంసలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. వేణుస్వామికి కాంట్రవర్సీ కాదు.. సాయం చేయడం కూడా వస్తుందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.