AP Minister Nara Lokesh Met Prime Minister Narendra Modi: ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేష్ .. గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటి అయ్యారు. ఈ సందర్బంగా వీళ్లిద్దరి మధ్య ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు.. తాజాగా జీఎస్టీ రేట్లు తగ్గింపు వంటివి చర్చకు వచ్చాయి.
1/5AP Minister Nara Lokesh Met Prime Minister Narendra Modi: గౌరవీనయులైన ప్రధాన మంత్రితో ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేష్ భేటి ముగిసింది. దాదాపు వీళ్లిద్దరి మధ్య 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది.
2/5ముఖ్యంగా యోగాంధ్ర కార్యక్రమంపై రూపొందించిన పుస్తకాన్ని ప్రధాని కి అందచేసారు లోకేష్. అంతేకాదు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలపై కృతజ్ఞతలు తెలియజేసారు.
3/5ముఖ్యంగా కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, ఏపీతో పాటు దేశ తాజాగా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో చర్చించారు లోకేష్ .
4/5ముఖ్యంగా జిఎస్టి స్లాబ్ ల హేతుబధ్దీకరణపై ఏపీ ప్రభుత్వం తరుపున ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. మరోవైపు జీఎస్టీ సంస్కరణల అమలుపై ప్రధాని మోడీకి లోకేష్ అభినందనలు తెలిపారు. ప్రత్యేకించి విద్యారంగంలో ఉపయోగించే పలు రకాల వస్తువులపై పన్ను తగ్గించినందకు ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు విద్యాశాఖ మంత్రిగా లోకేష్.
5/5అంతేకాదు ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమలు స్థాపన , సింగపూర్ లో ఏపీ బృందం పర్యటన వివరాలను ప్రధానికి వివరణ ఇచ్చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో సెమికండక్టర్ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానికి ఏపీ ప్రభుత్వం తరుపున లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.