Stree shakti Free bus Scheme: ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు మాట్లాడుతూ.. త్వరలో 1,000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. అంతేకాకుండా వీటిలో.. 300 బస్సులు తిరుపతికి, మిగిలిన 700 బస్సులు 13 ప్రాంతాలకు కేటాయిస్తామన్నాని వెల్లడించారు.
1/6ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు సైతం ఎన్నికల్లో ఇచ్చిన హమీల మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించాయి. ఈ క్రమంలో మహిళలను నుంచి కూడా ఉచిత బస్సు జర్నీకి మంచి రెస్పాన్స్ వస్తుంది.
2/6అయితే.. కొన్ని చోట్ల కొంత మంది మహిళలు కొట్టుకొవడం, బూతులు తిట్టుకుంటూ దాడులు చేసుకొవడం కామన్ గా మారిన విషయం తెలిసిందే. ఇది వదిలేస్తే మహిళలు మాత్రం ఏంచక్కా ఉచిత బస్సు ప్రయాణంను మంచిగా ఉపయోగించుకుంటున్నారు.
3/6ఇదిలా ఉండగా.. ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమల రావు మహిళలకు మరో శుభవార్త చెప్పారు. తాడిపత్రిలోని ఆర్టీసీ డిపోను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో స్త్రీ శక్తి పథకాన్ని.. ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లోనూ అమలు చేయనున్నట్లు ఆర్టీసీ MD ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.
4/6ఇప్పటి వరకు ఈ పథకం పల్లెవెలుగు,ఆర్టీనరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో ఇంప్లిమెంట్ చేసేవారు . కానీ తాజాగా.. ఆర్టీసీ ప్రయాణానికి మహిళల నుంచి వస్తున్న రెస్సాన్స్ తో మరింత మెరుగైన సేవల్ని అందించే దిశగా.. ఏసీ బస్సుల్లో కూడా ఈ పథకంను అతి తొందరలో అమలు చేస్తామన్నారు.
5/6అదే విధంగా.. అతి త్వరలో 1,000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. 300 బస్సులు తిరుపతికి, మిగిలిన 700 బస్సులు 13 ప్రాంతాలకు కేటాయించనున్నట్లు తెలిపారు. స్త్రీ శక్తి పథకంతో రోజూ లక్షలాది మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారని వెల్లడించారు.
6/6స్త్రీశక్తి పథకం అమలుతో రోజూ లక్షలాది మంది మహిళలు ఆర్టీసీ సర్వీసులను వినియోగిస్తున్నారని ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. పెరుగుతున్న మహిళా ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని, అన్ని బస్టాండ్లలో తాగునీరు, మరుగుదొడ్లు, కూర్చునే సీట్లు వంటి సౌకర్యాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులలో, మెరుగైన మౌలిక వసతులతో, ప్రయాణికులకు ప్రయాణాల్ని మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.