AP Rains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య హెచ్చరిక.. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మరి కొన్ని గంటల్లో పిడుగులు పడనున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మేరకు హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది.
1/5ఏపీలోని వాతావరణ శాఖ పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
2/5శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో.. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడవచ్చని ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చారు.
3/5తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
4/5అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
5/5భారీ ఈదురు గాలుల దృష్ట్యా వేటకు వెళ్లే మత్సకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.