Annadata Sukhibava: ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.7000.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు..!

Minister Big Alert Annadata Sukhibava: అన్నదాత సుఖీభవ ఎల్లుండి రైతుల ఖాతాల్లో రూ.7000 జమ కానున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలలో 19వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనున్నారు. దీంతో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.. 
 

1 /5

అన్నదాత సుఖీభవపై అధికారిక ప్రకటన చేశారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. ఈనెల 19వ తేదీన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రూ.7000 విడుదల కానున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5000, కేంద్ర ప్రభుత్వం రూ.2000 పీఎం కిసాన్ నిధులు మంజూరు చేయనున్నారు.  అయితే అర్హులైన రైతులు చనిపోతే వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి అన్నారు.  

2 /5

ఎన్‌పీసీఐఎల్‌లో ఇనాక్టివ్ గా ఉన్న అకౌంట్లో యాక్టివేట్ చేయాలి. ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించాలి. అలాగే ఈ స్కీమ్ అర్హత ఉన్నవారు ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని కూడా మరింత సులభతరం చేయాలని ఆయన సూచించారు.  

3 /5

 అయితే ఎల్లుండి రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధులు విడుదల కానున్నాయి. దీంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం కూడా అమలు చేయనున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఇది రెండో విడత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం నిధులను విడుదల చేస్తుంది.  

4 /5

 రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమవుతుంది. కడప జిల్లా కమలాపురం నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిధులు విడుదల చేస్తారని ఆయన అన్నారు. ఈ పథకం ద్వారా 46 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందనున్నారు.  

5 /5

 అయితే అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్సైట్లో మీరు పేరు నమోదు చేసుకోవచ్చు కొన్ని నిబంధనలు ఉన్నాయి వాటిని అనుసరించి ఈ పథకానికి అర్హత పొందుతారు 10,000 కు పైగా పెన్షన్ రాకూడదు ఎలాంటి ఆదాయపన్ను కట్టకూడదు అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు చేయకూడదు