Add Zee Business As A Preferred Source
App

Anupama Parameswaran: తెలుగు స్టార్ హీరో సినిమా వల్ల ఆరు నెలలు..నరకం చూసిన అనుపమ పరమేశ్వరన్.. ఏం చెప్పిందంటే..!

Written ByVishnupriya
Published: Sep 03, 2025, 10:37 PM IST|Updated: Sep 03, 2025, 10:37 PM IST

Anupama Parameswaran Upcoming Movies : అనుపమ పరమేశ్వరన్ గురించి సౌత్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచాలు అవసరం లేదు. ఎన్నో సినిమాలు చేసిన ఈ హీరోయిన్.. తెలుగులో ఈ మధ్యనే పరదా అనే చిత్రంలో కనిపించింది. ఈ క్రమంలో ఒక స్టార్ హీరో సినిమా గురించి అనుపమ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి..

Anupama Parameswaran Career 1/5

అనుపమ పరమేశ్వరన్

చిన్న చిన్న సినిమాలు చేసినా కూడా తనకంటూ పెద్ద పేరు సంపాదించుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ చిత్రంతో అందరినీ ప్రేమగా పలకరించిన ఈ హీరోయిన్ కార్తికేయ చిత్రంతో పాన్ ఇండియా సక్సెస్ సైతం.. అందుకుంది.

Anupama Parameswaran Missed Opportunity2/5

అనుపమ పరమేశ్వరన్

ఈ మధ్యనే టిల్లు స్క్వేర్ కూడా ఎందుకు మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. ఇలా విజయాలు అందుకుంటున్న అనుపమ పరమేశ్వరానికి చెప్పుకోదగిన ఆఫర్లు మాత్రం రావడం లేదు. 

Anupama Parameswaran Ram Charan 3/5

అనుపమ పరమేశ్వరన్

ఈ క్రమంలో తాజాగా ఈ హీరోయిన్ ఒక స్టార్ హీరో సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీస్తున్నాయి. రామ్ చరణ్ రంగస్థలం సినిమా వల్ల తను ఆరు నెలలు చాలా బాధపడ్డాను అని.. తనకు ఆఫర్లు కూడా రాకుండా పోయాయి అని చెప్పుకొచ్చింది అనుపమ.

Anupama Parameswaran Interview 4/5

అనుపమ పరమేశ్వరన్

అసలు విషయానికి వస్తే రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో ముందుగా అనుపమ పరమేశ్వరాన్ని తీసుకున్నారంట. అయితే ఆ తరువాత కొన్ని కారణాలవల్ల.. ఆమెను తీసేసి సమంతను పెట్టుకున్నారు. కానీ బయట మీడియాలో మాత్రం అనుపమ స్వయంగా సినిమా వదులుకున్నట్టు వార్తాలు వచ్చాయి. 

Anupama Parameswaran Shocking Incident5/5

అనుపమ పరమేశ్వరన్

అయితే ఇలాంటి వార్తలు రావడం వల్ల.. అప్పట్లో తనను చాలా మంది తిట్టారు అని.. అంతేకాకుండా ఆరు నెలల పాటు ఆ ప్రభావం వల్ల తనకు ఆఫర్లు కూడా రాలేదు అని.. ఇలా తను అసలు చెయ్యని తప్పుకు.. శిక్ష మాత్రం పడాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది.