Anushka: ఏది ఏమైనా సరే.. పెళ్లి మాత్రం అతనితోనే.. ఫైనల్ గా ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన అనుష్క

Anushka Shetty Marriage 
అనుష్క పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా అని ఆమె అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. నాలుగు పదుల వయసు దాటి.. ఇక కొద్ది సంవత్సరాల ఐదు పదుల వయసులోకి కూడా అడుగు పెట్టే బోతోంది అనుష్క. ఈ క్రమంలో ఈ బొమ్మాలి పెళ్లి గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..

1 /5

అరుంధతి చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్ అనుష్క. తెలుగు పరిశ్రమలో అనుష్కకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు.

2 /5

అంతేకాదు ఈ హీరోయిన్ ని అందరూ ఎంతో ముద్దుగా స్వీటీ అని కూడా అంటారు. కానీ అలాంటి అనుష్క నాలుగు పదుల వయసు దాటి ఎన్నో సంవత్సరాలు కావస్తున్న ఇంకా పెళ్లి ఊసు మాత్రం ఎత్తలేదు. 

3 /5

దీంతో ఎప్పుడు అనుష్క పెళ్లి చేసుకుంటుంది అంటూ ఆమె అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అనుష్క, ప్రభాస్ ప్రేమలో ఉన్నారు అన్న వార్త కూడా ఎన్నో రోజులు వైరల్ అయింది.

4 /5

కానీ తమ మధ్య ఉండేది స్నేహం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు ఈ జంట. ఇక ఇప్పుడు అనుష్క ఫైనల్ గా తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది..” నాకు పిల్లలు అంతే చాలా ఇష్టం. తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. కానీ ప్రేమ లేకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఏది ఏమైనా నేను ప్రేమించిన వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటారు. ఈ విషయంపై మా అమ్మానాన్న మద్దతు కూడా నాకు ఉంది” అంటూ చెప్పుకొచ్చింది.

5 /5

అంతే కాదు తాను ప్రస్తుతం సరైన వ్యక్తి కోసం అలానే సరైన సమయం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది..