Add Zee Business As A Preferred Source
App

Anushka Shetty: నా లైఫ్ లో చేసిన అతి పెద్ద తప్పు అదే.. అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్స్..

Written ByTA Kiran Kumar
Published: Sep 16, 2025, 03:25 PM IST|Updated: Sep 16, 2025, 03:25 PM IST

Anushka Shetty Shocking comments: సినీ ఇండస్ట్రీలో ప్రతి హీరో, హీరోయిన్ కు తెలిసో.. తెలియకో కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. అలా అనుష్క శెట్ట కెరీర్ లో చేసిన అతిపెద్ద తప్పు అదేనట. అప్పట్లో అనుష్క చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Anushka Shetty Shocking 1/6

అనుష్క శెట్టి షాకింగ్

అనుష్క శెట్టి ఓ సీనియర్ స్టార్ హీరోతో సినిమా చేయడం తన లైఫ్ లో చేసిన అతిపెద్ద తప్పల్లో ఒకటిగా చెబుతూ పశ్చాతాపం వ్యక్తం చేస్తూనే ఉంటుంది. స్వీటి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నాగార్జున హీరోగా  తెరకెక్కిన ‘సూపర్’ చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత వెనక్కి తిరుగి చూసుకోలేదు. 

 

Anushka 2/6

అనుష్క

అంతేకాదు హీరోయిన్ గా అనుష్క తెలుగు  చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా స్వీటీ పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణతో కలిసి నటించడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని చెప్పడం ఆయన ఫ్యాన్స్ కు చిర్రెత్తికునేలా చేసింది. 

 

Okka Magadu 3/6

ఒక్క మగాడు

అనుష్క శెట్టి.. బాలయ్య సరసన ‘ఒక్క మగాడు’ అనే ఒకే చిత్రంలో యాక్ట్ చేసింది. ఈ చిత్రాన్ని వైవియస్ చౌదరి డైరెక్ట్ చేశారు.  హీరోయిన్ గా బుడి బుడి అడుగులు వేస్తోన్న క్రమంలో   ఈ చిత్రంలో యాక్ట్ చేసింది. ఈ చిత్రం 2008 సంక్రాంతి కానుకగా విడుదలై బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో అనుష్క శెట్టి క్యారెక్టర్ కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ‘ఒక్క మగాడు’ చిత్రంలో ఓ సాంగ్ లో  బాలయ్యతో చేసిన అంగాంగ ప్రదర్శన అనుష్కను  తీవ్ర విమర్శలు పాలు అయ్యేలా చేసింది. 

Balayya - Anushka Shetty 4/6

బాలయ్య - అనుష్క శెట్టి

కెరీర్ మొదట్లో బాలయ్య, వైవియస్ చౌదరి  క్రేజీ కాంబినేషన్ అని ‘ఒక్క మగాడు’ చిత్రాన్ని తెలియక ఒప్పుకున్నానని చెప్పింది.  అందులో బాలయ్యతో చేయడం కాదు కానీ.. కథతో పాటు మూవీలో  తన క్యారెక్టర్ ఏంటో అసలు  తెలుసుకోకుండా యాక్ట్ చేయడం తాను చేసిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ అని చెప్పుకొచ్చింది. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. 

 

Bahubali 5/6

బాహుబలి

అనుష్క శెట్టి.. రాజమౌళి డైరెక్షన్ లో  ప్రభాస్ తో కలిసి నటించిన ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తోంది. బాహుబలి వంటి ప్యాన్ ఇండియా సక్సెస్ తర్వాత అనుష్క తన ఇమేజ్ కు తగ్గ కథలను మాత్రమే చేస్తోంది. ఆ తర్వాత ‘భాగమతి’, నిశ్శబ్దం, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి.. తాజాగా ‘ఘాటి’ సినిమాల్లో మాత్రమే నటించింది. 

Ghaati 6/6

ఘాటి

క్రిష్ దర్శకత్వంలో నటించిన ‘ఘాటి’ మూవీ ప్రేక్షకులను పెద్డగా అలరించలేకపోయింది.   మరోవైపు అనుష్క,  ప్రభాస్  పెళ్లి చేసుకోబోతున్నారంటూ పూటకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇద్దరు స్టిల్ బ్యాచిలర్స్ కావడంతో ఈ రూమర్స్ కు మరింత  క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. అంతేకాదు వాళ్లిద్దరిలో ఎవరి మ్యారేజ్ అయితే కానీ ఈ రూమర్స్ కు చెక్ పడవని చెబుతున్నారు.