Add Zee Business As A Preferred Source
App

Anushka: అనుష్క జాతకంలో ఇంత పెద్ద దోషం ఉందా ? అందుకే పెళ్ళికి దూరం..

Written ByVishnupriya
Published: Sep 29, 2025, 07:45 PM IST|Updated: Sep 29, 2025, 07:45 PM IST

Anushka Marriage: ప్రముఖ హీరోయిన్ అనుష్క జాతకంలో అంత పెద్ద దోషం ఉండడం వల్లే ఆమె పెళ్లికి దూరంగా ఉంటుందని.. వార్తలు అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇంతకీ ఆ దోషం ఏమిటి.. అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

Anushka Shetty Horoscope 1/5

అనుష్క జాతకం

ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.  తన అద్భుతమైన నటనతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె..  బాహుబలి తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి కూడా దూరమయింది.   

Anushka Shetty Marriage2/5

అనుష్క జాతకం

మళ్లీ రీఎంట్రీలో భాగంగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఇటీవల ఘాటి సినిమా చేసి పరవాలేదు అనిపించుకుంది.  ఇకపోతే వరుస సినిమాలు ప్రకటిస్తోంది. కానీ పెళ్లి మాట ఎత్తకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Anushka Shetty Love 3/5

అనుష్క జాతకం

అనుష్క వివాహంపై ఎప్పటికప్పుడు రూమర్లు వినిపిస్తున్నా.. ఏ ఒక్కటి కూడా నిజం కాలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా అనుష్క ప్రభాస్ గా ప్రేమలో ఉంది అన్న వార్త వైరల్ అవుతూనే ఉంది.. కానీ ఇది కేవలం రూమర్స్ అంటూ వాళ్ళిద్దరూ కూడా చెప్పుకుంటూ వచ్చా. అయితే ఇలాంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైన వార్త తెరపైకి వచ్చింది.  

Anushka Horoscope4/5

అనుష్క జాతకం

అసలు విషయంలోకెళితే అనుష్క జాతకంలో కుజదోషం ఉందని.. అందుకే ఆమె పెళ్లి గడియలు వెనకే వెళ్లిపోతున్నాయని ఇప్పుడు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అందుకే ప్రభాస్ అమ్మ అనుష్కతో పెళ్లికి ఒప్పుకోలేదన్న రూమర్స్ కూడా కొద్ది రోజులు క్రితం మీడియాలో ప్రచారం అయ్యాయి.

Anushka Personal Life5/5

అనుష్క జాతకం

ఇక ఈ కుజదోషాన్ని ఆమె క్లియర్ చేసుకోవాలని..  త్వరగా పెళ్లి చేసుకొని వైవాహిక బంధం లోకి అడుగు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే అనుష్కనే చెప్పాలి.