Anushka Marriage : ఎన్నో రోజులు క్యాప్ తీసుకున్నా అనుష్క ఫైనల్ గా మరోసారి క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ఘాటీ చిత్రంలో కనిపించనుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ ఐదున విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పెళ్లి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది అనుష్క..
అనుష్క చాలా రోజుల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఇక ఈ వారంలో ఘాటీ సినిమాతో తన అభిమానులను పలకరించనుంది.
ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా.. తాజాగా అనుష్క .. రానా తో ఫోన్ కాల్ మాట్లాడింది. ఈ ఫోన్ కాల్ ఈ సినిమా చాలా బాగుంటుంది అని చెప్పుకొచ్చింది.
ఇక అంతేకాకుండా రానా ఎందుకు చాలా తక్కువ సినిమాలు చేస్తున్నావు అని అడగగా.. “అందరూ ఇదే అడుగుతున్నారు.. మీరనే కాదు బయట కూడా ఇదే అడుగుతున్నారు.. ఇంట్లో పెళ్లిలో కూడా అదే అడుగుతున్నారు,” అంటూ చెప్పింది
ఇక ఇంట్లో పెళ్లి అన్నమాట వినగానే రానా ఆశ్చర్యపోయి ఏమిటి పెళ్లి చేసుకుంటున్నావా అంటూ అడిగారు. ఇక అనుష్క తన ఇంట్లో పెళ్లి జరుగుతోందని కానీ అది తన పెళ్లి కాదు అంటూ క్లారిటీ ఇచ్చింది.
మొత్తానికి అనుష్క ఇంట్లో మాత్రం పెళ్లి పనులు మొదలైనట్టే చెప్పుకొచ్చింది. అయితే ఇది ఎవరి పెళ్లి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాగా అనుష్కకి ఒక బ్రదర్ ఉన్నారు.. ఇది అతని పెళ్లి అయ్యుండొచ్చు అని అభిమానులు అనుకుంటున్నారు.