Anushka Interview
అనుష్క ఘాటీ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం డైరెక్ట్ గా కాకుండా కొన్ని ఫోన్ ద్వారా లేకపోతే ఆడియో ద్వారా ఇంటర్వ్యూలు ఇస్తోంది అనుష్క. తాజాగా అనుష్క , ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి..
1/5అనుష్క, ప్రభాస్ మధ్యలో ప్రేమ ఉంది అన్న వార్త ఎన్నో రోజుల నుంచి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. వీళ్ళిద్దరూ మాత్రం తమ మధ్య ఉండేది స్నేహం మాత్రమే అంటూ చెబుతూ వచ్చారు..
2/5ఇక తాజాగా అనుష్క, ప్రభాస్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అనుష్క ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో.. రానున్న ఘాటీ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఉంది. అయితే డైరెక్ట్ గా కాకుండా టెలిఫోన్ ద్వారా లేకపోతే డిజిటల్ మీడియా ద్వారా ఇంటర్వ్యూలు ఇస్తోంది ఈ హీరోయిన్.
3/5ఈ క్రమంలో ఈ మధ్య ఒక ప్రముఖ వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. పుష్ప అలానే ఘాటీ సినిమాల క్రాస్ ఓవర్ తనకు చూడాలని ఉంది అని చెప్పుకొచ్చింది.
4/5ఇక ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు బాహుబలి తర్వాత ప్రభాస్ తో సినిమా చేయాలని ఉందని. కానీ ప్రభాస్ తో చేసే సినిమా తప్పకుండా చాలా స్పెషల్ గా ఉండాలి అని.. కథ విని తను అలానే ప్రభాస్ ఇష్టపడితే.. తమ ఇద్దరితో సినిమా అనేది తప్పకుండా జరుగుతుంది అని చెప్పుకొచ్చింది.
5/5ఇక ప్రభాస్తో తను తదుపరి చేయబోయే సినిమా తప్పకుండా స్పెషల్ గా ఉండేలా చూసుకుంటానని అనుష్క చెప్పడంతో.. వీరిద్దరి అభిమానులు కూడా ఇది జరిగితే బాగుండు అని ఆకాంక్షిస్తున్నారు.