Anveshi Jain: ఉలి చెక్కిన శిల్పంలా కుర్రాళ్ల మతులు పోగుడుతున్న అన్వేషి జైన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
అన్వేషి జైన్.. గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసే బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఈమె కొన్ని సినిమాల్లో నటించింది. పెద్దగా ఈమెకు పెద్దగా ఒరిగిందేమి లేదనే చెప్పాలి.
ఎప్పటికపుడు సోషల్ మీడియా తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేయడం అన్వేషి మార్క్ స్టైల్ అని చెప్పాలి.
తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’లో ఐటెం సాంగ్ లో నటించింది. కానీ ఈ సినిమా ఫెయిల్ కావడంతో తెలుగు ఇండస్ట్రీపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి.
అన్వేషి ఓ మోటివేషనల్ స్పీకర్ కమ్ యూట్యూబర్.. ప్రస్తుతం వెబ్ సిరీస్, సినిమాలతో దూసుకుపోతున్న ఈమె మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో జన్మించింది.
భోపాల్ లోని రాజీవ్ గాంధీ టెక్నికల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత వ్యాపార రంగంలో ప్రవేశించింది. అక్కడ నష్టాలు రావడంతో ముంబై షిఫ్ట్ అయి.. మోడల్ గా రాణించింది.
2018లో ‘గందీ బాత్’ వెబ్ సిరీస్ తో పాపులర్ అయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది.