Add Zee Business As A Preferred Source
App

Chandrababu naidu: డిప్యూటీ సీఎం పవన్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. అసలు కారణం ఏంటో తెలుసా..?

Written ByInamdar Paresh
Published: Sep 28, 2025, 04:14 PM IST|Updated: Sep 28, 2025, 04:20 PM IST

Deputy cm pawan kalyan: వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్య సేవల కోసం పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చారు.ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఈరోజు పవన్ ఇంటికివెళ్లి ఆయన్ను కలిశారు.
 

Pawan kalyan:1/5

పవన్ కళ్యాణ్:

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరం, జలుబు,దగ్గులతో బాధపడుతున్నారు. ఒకవైపు ట్రీట్మెంట్ చేయించుకుంటునే మరోవైపున అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.  ఓజీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా పవన్  వర్షంలో తడిచారు.

chandrababu naidu:2/5

చంద్రబాబు నాయుడు:

 అప్పటి నుంచి ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయనను వైద్యులు హైదరాబాద్ వెళ్లి మెరుగైన ట్రీట్మెంట్ చేయించుకొవాలని సూచించారు. దీంతో వైద్యుల సూచనల మేరకు.. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఇంటికి ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడు వెళ్లారు. గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్‌ను ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.   

ap govt:3/5

ఏపీ ప్రభుత్వం:

నేరుగా చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్లి.. ఇంటికి వెళ్లి యోగక్షేమాల గురించి మాట్లాడారు. వైద్యులు ఇచ్చిన సలహాలపై ఆరాతీశారు. తగినంత రెస్ట్ తీసుకొవాలని సూచించారు. ఈ సందర్భంగా పవన్‌తో కాసేపు మాట్లాడిన చంద్రబాబు, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు ఎక్స్ లో ట్విట్ కూడా చేశారు.  

pawan kalyan suffering with fever:4/5

పవన్ కళ్యాణ్:

మరోవైపు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బాలయ్య చేసిన వ్యాఖ్యలు సైతం రాజకీయంగా దుమారంగా మారాయి. దీనిపై చిరంజీవి కూడా అదే రెంజ్ లో కౌంటర్ ఇచ్చారు. దీంతో బాలయ్య వర్సెస్ చిరంజీవి అభిమానుల మధ్య వార్ నడుస్తొంది.   

balayya vs chiru:5/5

బాలయ్య:

చిరంజీవికి బాలయ్యసారీ చెప్పాలని అభిమానులు డిమాండ్  చేస్తున్నారు.మరోవైపు ఇటీవల కామినేని శ్రీనివాస్ తనవ్యాఖ్యలతో మనస్పర్థలు వచ్చేలా మారాయని వాటిని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు. ఇక బాలయ్య, చిరు వివాదంపై కూడా ఇద్దరు చర్చించుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు, పవన్ ను వేరుచేసేందుకు దీన్ని వైసీపీ వాడుకుంటుందని కూడా కొంత మంది ట్రోల్స్ చేస్తున్నారు.