Add Zee Business As A Preferred Source
App

Pawan Kalyan Net Worth: పవన్ కళ్యాణ్ మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. అసలు ఎక్స్ పెక్ట్ చేయరు..

Written ByTA Kiran Kumar
Published: Sep 02, 2025, 12:04 AM IST|Updated: Sep 02, 2025, 07:16 AM IST

Pawan Kalyan Net Worth: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా హీరోనే కాదు.. రాజకీయ నాయకుడిగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. ఇక పవన్ కు సినిమాల నుంచి తప్పించి వేరే ఇతర ఆదాయాలు లేవు. ఇక ఈయన మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఎంతంటే..

 

Pawan Kalyan Net Worth1/6

పవన్ కళ్యాణ్ ఆస్తి పాస్తులు

Pawan Kalyan Net Worth:  పవన్ కళ్యాణ్..  చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. అంతేకాదు అన్న చిరు తెలుగు సినీ రంగంలో మెగాస్టార్ గా ఎదిగితే.. పవన్ .. పవర్ స్టార్ గా ఎదిగారు. 

Akkada Abbayi ikkada Abbayi 2/6

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

అంతేకాదు 1996లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 

Pawan Kalyan  3 Decades 3/6

హీరోగా 3 దశాబ్దాల ప్రయాణం

హీరోగా ప్రవేశించిన మరో యేడాదితో 3 దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనున్నారు. ముప్పై ఏళ్లలో దాదాపు 30 చిత్రాల్లో నటించారు. అంటే యేడాదికి ఒక్కో సినిమాలో యాక్ట్ చేసాడని చెప్పొచ్చు. 

 

Praja Rajyam 4/6

ప్రజారాజ్యం

అంతేకాదు 2008లో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా రాజకీయ అరంగేట్రం చేసారు. ఆ తర్వాత ఆ పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయడంతో పాటు కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత అన్నతో రాజకీయంగా విభేదించి 2014లో సొంతంగా ప్రజా రాజ్యం పేరు ధ్వనించేలా ‘జనసేన’ పార్టీని స్థాపించారు. 

AP Deputy CM 5/6

ఏపీ డిప్యూటీ సీఎం

ఇక 2019లో తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన గాజువాక, భీమవరంలో ఓడిపోయారు. అయినా.. ఎక్కడా కృంగిపోకుండా.. 2024లో బీజేపీ, టీడీపీతో కూటమిగా బరిలో దిగి పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను గెలిచి 100 శాతం స్ట్రైక్  రేట్ సాధించారు. అంతేకాదు తొలిసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. 

Pawan Affidavit 6/6

పవన్ అఫిడవిట్

అయితే 2024 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ రూ. 114.76 కోట్లుగా వెల్లడించారు.  తన ఆదాయంలో పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ. 73.92 కోట్లు చెల్లించినట్టు చెప్పారు.అంతేకాదు తన సంపాదనలో ఎక్కువ భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించారు. అప్పులు రూ. 64.26 కోట్లు ఉన్నట్టు తెలిపారు. మొత్తంగా హైదరాబాద్ లో ఇంటితో పాటు ఫామ్ హౌస్ కలిపి ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం దాదాపు రూ. 200 కోట్ల వరకు ఉంటుందనేది సమాచారం.