Add Zee Business As A Preferred Source
App

Dussehra Holidays: విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్‌ చెప్పిన నారా లోకేశ్‌.. దసరా సెలవులు అదనంగా 2 రోజులు పొడగింపు..!

Written ByRenuka Godugu
Published: Sep 19, 2025, 01:02 PM IST|Updated: Sep 19, 2025, 01:02 PM IST

AP Dussehra Holidays 2 Days Extended: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌. ఏపీలోని పాఠశాలలకు మరో రెండు రోజులు స్కూళ్లకు సెలవులు పొడగించారు. అధికారికంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ దసరా సెలవులపై ప్రకటన చేశారు. దీంతో దసరా సెలవులు 2025 సెప్టెంబర్‌ 22 నుంచి అక్టోబర్‌ 2 వరకు ప్రకటించారు.
 

AP Dussehra School Holidays1/5

ఏపీ స్కూళ్లకు దసరా సెలవులు

దసరా వేళ ఏపీ విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది ఏపీ ప్రభత్వం. ఉపాధ్యాయుల కోరిక మేరకు మరో రెండు రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.  ఈమేరకు నారా లోకేశ్‌ అధికారిక ప్రకటన చేశారు   

Lokesh Tweet2/5

లోకేశ్‌ ట్వీట్‌

విద్యాశాఖ అధికారులతో చర్చింది ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. అయితే, అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్‌ 2 వరకు దసరా సెలవులు ప్రకటించారు. తాజాగా మార్పు చేయడంతో ఏపీలో మరో రెండు రోజులు అదనంగా సెలవులు రానున్నాయి.  

Nara Lokesh3/5

నారా లోకేశ్‌

ఈ మేరకు ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌ వేధికగా ప్రకటించారు. టీడీపీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు  విద్యాశాఖ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. మరోవైపు తెలంగాణలో కూడా అక్టోబర్‌ 22 నుంచే స్కూళ్లకు సెలవులు రానున్నాయి.  

School holidays4/5

స్కూళ్లకు సెలవులు

మొత్తంగా ఇక్కడ కూడా 13 రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ సెలవుల్లో ప్రత్యేక క్లాసులు తీసుకునే ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.