AP Mega DSC: మెగా డీఎస్సీపై ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఇటీవల ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మంగళవారానికి వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేసింది.
1/5ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేసింది. తాజాగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను.. మంగళవారానికి వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేసింది.
2/5అయితే ఈ ప్రక్రియ ముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సోమవారం, ఆగస్టు 25 నుంచే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కాల్ లెటర్ల పంపిణీలో జాప్యం జరగడంతో.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ఒక రోజు అధికారులు వాయిదా వేశారు.
3/5మెగా డీఎస్సీ 2025 మెరిట్ జాబితాను ఇప్పటికే విడుదల చేయగా.. అభ్యర్థులు పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కూడా కేటాయించారు. ఇక రిజర్వేషన్లు, స్థానికత ప్రమాణాల ఆధారంగా ఎంపికైన వారికి కాల్ లెటర్లు ఇవ్వాల్సి ఉంది.
4/5కాబట్టి ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా.. పలు దఫాలుగా జాబితాలను అధికారులు పరిశీలిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ సోమవారం ఉదయం నుంచి.. అభ్యర్థుల లాగిన్‌లో కాల్ లెటర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
5/5ఇక సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. కౌన్సెలింగ్ అనంతరం ఎంపికైన అభ్యర్థులను సెప్టెంబర్ రెండో వారంలోనే.. పాఠశాలల్లో జాయిన్ అయ్యేలా షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నారు.