April School Holidays 2025 List: ఏప్రిల్ నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు వస్తున్నాయి. పండుగలు, ప్రత్యేక రోజుల సందర్భంగా స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పండగ చేసుకున్న చేసుకోనున్నారు అని చెప్పాలి.
ఏప్రిల్ నెలలో కొన్ని హిందూ, జైన్, క్రిస్టియన్ పండుగలు, ప్రత్యేక రోజుల సందర్భంగా స్కూళ్లకు భారీగా సెలవులు రానున్నాయి. 2025 ఏప్రిల్ లో స్కూళ్లకు ఎక్కువ మొత్తంలో సెలవులు వస్తున్నాయి. ప్రధానంగా రామనవమి, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే సందర్భంగా స్కూళ్లకు సెలవు రానుంది ఆ జాబితా ఇదే ..
ఏప్రిల్ 6 శ్రీరామనవమి.. శ్రీరామనవమి హిందువులు చైత్ర నవరాత్రుల రోజుల్లో నిర్వహిస్తారు. ఈరోజు ఆలయాల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. శ్రీరాముడు, విష్ణుమూర్తి ఏడవ అవతారం పరిగణిస్తారు. ఈరోజు అంగరంగ వైభవంగా రాముల వారి గుడిలో పూజలు నిర్వహిస్తారు. 2025 ఏప్రిల్ 6న శ్రీరామనవమి రానుంది
ఏప్రిల్ 10 మహావీర్ జయంతి.. మహావీర్ జయంతి మహావీర్ జన్మ కళ్యాణక కూడా పిలుస్తారు. ఈరోజు మహావీరుడి పుట్టినరోజు తీర్థంకరుడుగా పరిగణిస్తారు. చైత్ర నవరాత్రుల 13వ రోజు మహావీర్ జయంతిని నిర్వహిస్తారు. 2025లో మహావీర్ జయంతి ఏప్రిల్ 10 గురువారం రోజు నిర్వహిస్తున్నారు.
ఏప్రిల్ 18 గుడ్ ఫ్రైడే.. గుడ్ ఫ్రైడే క్రిస్టియన్లు జరుపుకుంటారు. ఆ తర్వాత రెండో రోజుకు ఈస్టర్ కూడా ఆదివారం నిర్వహించే ఆనవాయితీ ఉంది. ఈరోజు ప్రార్ధనలు నిర్వహిస్తారు. దీన్ని గ్రేట్ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. 2025లో గుడ్ ఫ్రైడేను ఏప్రిల్ 18న నిర్వహించనున్నారు.
ఇవి కాకుండా విద్యార్థులకు మరిన్ని ప్రత్యేక రోజుల్లో కూడా సెలవులు రానున్నాయి. ప్రధానంగా ఏప్రిల్ 6, 13, 20, 27 తేదీల్లో ఆదివారం రానుంది. ఆ రోజుల్లో అన్ని పాఠశాలలు, కాలేజీలకు సెలవు. అయితే ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఎండాకాలం సెలవులు కూడా ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 12 రెండో శనివారం కాబట్టి స్కూళ్లకు సెలవులు ఉంటాయి.