Arjuna Tree Prevents Heart Attack: మనలో ఎంతో మంది చిన్న వయసులో గుండె జబ్బులతో బాధపడుతున్నారు. అలాంటి వారికి గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఔషధం ఒకటి ఉంది. ఇది సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరుకుతుంది. దాన్ని గురించి తెలుసుకుందాం.
పెరుగుతున్న గుండెపోటు కేసులను నివారించడానికి.. ఆయుర్వేదం అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. కేవలం రూ. 15 కి లభించే అర్జున చెట్టు బెరడు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం వల్ల ఇటీవలి కాలంలో గుండె జబ్బులు సర్వసాధారణంగా మారాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలలో బ్లాక్ ఏర్పడటమే అందుకు కారణంగా కనిపిస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం.. అర్జున చెట్టు బెరడు గుండె సమస్యలకు ఒక వరంగా భావిస్తారు. టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, కౌమరిన్ వంటి దాని ఔషధ గుణాలు గుండె కండరాలను బలపరుస్తాయి.
అధిక రక్తపోటు గుండె జబ్బులకు ప్రధాన కారణం. అర్జున బెరడు రక్తపోటును సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిని పెంచుతుంది.
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణం. అర్జున చెట్టు బెరడుతో తయారు చేసిన కషాయం ఒత్తిడిని తగ్గించి, మనశ్శాంతిని అందిస్తుంది. అర్జున చెట్టు బెరడులో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి, ఇవి రక్తపోటును నియంత్రించడంలో మరియు గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
అర్జున చెట్టు బెరడుతో పాటు, అశ్వగంధ వంటి ఇతర ఆయుర్వేద మూలికలు కూడా గుండె ఆరోగ్యానికి మంచివి. అవి ఒత్తిడిని తగ్గించి గుండెను రక్షిస్తాయి. అందువల్ల అర్జున బెరడును ఉపయోగించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించబడింది. దీనిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)