IND vs PAK: ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ జట్టు వరుస ఓటములతో ఫుల్ డిప్రెషన్ లో ఉంది. గ్రూప్ దశలోనే భారత జట్టు చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో పాకిస్తాన్, సూపర్ 4లో కూడా మరోసారి టీమిండియా దెబ్బకు కుక్క చావు చచ్చినట్లయ్యింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో సులభ విజయాన్ని సాధించింది. ఈ పోరులో పాకిస్తాన్ బ్యాటర్లు ఒకింత ప్రతిభ చూపించినా, బౌలర్లు మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆగ్రహ తాండవానికి హరీస్ రవూఫ్ సహా పాకిస్తాన్ బౌలర్లు బిత్తరపోయారు.
1/5అయితే ఓడిపోవడమే కాకుండా హరీస్ రవూఫ్ మరోసారి తన ప్రవర్తనతో వివాదానికి దారి తీశాడు. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అభిషేక్ శర్మతో ఘర్షణకు దిగాడు. తరువాత బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు భారత అభిమానులు కోహ్లీ.. కోహ్లీ అంటూ నినదించారు. దీంతో అసహనానికి గురైన రవూఫ్ చేతితో 6-0 సిగ్నల్ చేశాడు. ఇది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో భారత అభిమానుల్లో ఆగ్రహానికి లోనయ్యారు.
2/5ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. నో హ్యాండ్ షేక్ వివాదం తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లు మైదానంలో 6-0 సిగ్నల్ చూపడం ఒక అలవాటుగా మారింది. పాకిస్తాన్ ఆర్మీ వెనుక ఉండి ఆటగాళ్లు ఇలా చేస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మహిళా క్రికెటర్ సిద్రా ఆమిన్ కూడా ఇలాంటి సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
3/5అయితే ఈ 6-0 సిగ్నల్ వెనుక అసలు అర్థం ఏమిటి? 2019లో పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఆర్మీ, భారత్‌కు చెందిన 6 ఫైటర్ జెట్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. అదే ఆధారంగా పాకిస్తాన్ ఆటగాళ్లు 6-0 అని చూపిస్తూ తాము విజయాన్ని సాధించినట్లు చూపించుకుంటున్నారు. కానీ వాస్తవం మాత్రం వేరేలా ఉంది. ఈ క్లెయిమ్‌పై ఎలాంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ పాకిస్తాన్ క్రికెటర్లు దీనిని ఒక "ప్రచార హథియార్"గా ఉపయోగిస్తున్నారు.
4/5టీమిండియా చేతిలో వరుస ఓటములు ఎదుర్కొంటున్న పాకిస్తాన్, తమ బలహీనతలు కప్పిపుచ్చుకోవడానికి ప్రతి సారి కొత్త వివాదాన్ని తెరమీదకు తెస్తోంది. గ్రూప్ దశలో "హ్యాండ్ షేక్" వివాదం, ఇప్పుడు సూపర్ 4లో "6-0" సిగ్నల్. ఈ విధానం పాకిస్తాన్ క్రికెట్‌కు కొత్తది కాదు. ప్రతి ఓటమి తర్వాత అభిమానుల దృష్టిని మరల్చేందుకు ఏదో ఒక బాహ్య అంశాన్ని ముందుకు తెస్తుంది.
5/5అదే సమయంలో పాకిస్తాన్ అభిమానులు కూడా తమ ఆటగాళ్ల తప్పిదాలను గమనించడం లేదు. హరీస్ రవూఫ్ 6-0 సిగ్నల్ ఇస్తున్న ఫోటోలు షేర్ చేస్తూ, "మ్యాచ్ ఓడినా మనసులు గెలిచాడు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. అభిమానులు ఇలా కొనసాగినంత కాలం పాకిస్తాన్ జట్టు ప్రదర్శన గాడిలో పడే అవకాశం తక్కువేనని విశ్లేషకులు అంటున్నారు.