Add Zee Business As A Preferred Source
App

IND Vs PAK: గిల్‌ నుండి అభిషేక్ వరకు.. పాక్‌తో ఇప్పటివరకూ టీ20 ఆడని 9 మంది భారత క్రికెటర్లు ఎవరో తెలుసా..?

Written ByAruna Maharaju
Published: Sep 14, 2025, 12:43 PM IST|Updated: Sep 14, 2025, 12:43 PM IST

Asia Cup 2025:ఆసియా కప్‌ 2025లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది. ఈ రెండు జట్ల క్రికెటర్లు మైదానంలో గట్టిగా పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు. అభిమానులు కూడా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో కొత్త ఆటగాళ్లు 9 మంది తొలిసారి పాకిస్తాన్‌తో టీ20 మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లు టీ20 ఫార్మాట్‌కు దూరమవడంతో యువ ఆటగాళ్లపై అందరి దృష్టి నెలకొంది.

Abhishek Sharma1/9

అభిషేక్ శర్మ

అభిషేక్ శర్మ.. ఈ లెఫ్ట్ హ్యాండర్ క్రికెటర్ గత సంవత్సరం తన T20I అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఇండియా తరపున 18 టీ20 మ్యాచ్ లు ఆడాడు. తన కెరీర్‌లో తొలిసారిగా పాకిస్తాన్‌తో తలపడటానికి సిద్ధమవుతున్నాడు.

Shubhman Gill2/9

శుభ్‌మన్ గిల్

శుభ్‌మన్ గిల్.. కొత్తగా నియమితుడైన ఈ వైస్ కెప్టెన్ పాకిస్తాన్‌తో 4 వన్డేలు ఆడి 130 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఆదివారం తొలిసారిగా పాక్ తో టీ20 మ్యాచ్ ఆడనున్నాడు.

Tilak Varma3/9

తిలక్ వర్మ

తిలక్ వర్మ.. 26 టీ20 మ్యాచ్‌లలో 749 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు పాక్‌తో తొలి మ్యాచ్ ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నాడు.

Sanju Samson4/9

సంజూ శాంసన్

సంజూ శాంసన్.. 42 టీ20 మ్యాచ్‌లు ఆడినా, పాకిస్తాన్‌తో ఇంతవరకు ఆడలేదు. ఈ మ్యాచ్‌లో అతను తన మొదటి టీ20 ఆడే అవకాశం ఉంది.   

Kuldeep Yadav5/9

కుల్దీప్ యాదవ్

కుల్దీప్ యాదవ్.. పాకిస్తాన్‌తో వన్డేల్లో 15 వికెట్లు తీసిన అనుభవం ఉంది. ఇప్పుడు టీ20లో తొలిసారి పాక్‌తో ఆడనున్నాడు.   

Rinku Singh6/9

రింకూ సింగ్

రింకూ సింగ్.. 33 టీ20 మ్యాచ్‌లలో 546 పరుగులు చేశాడు. అతను కూడా పాక్‌తో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు.  

Varun Chakravarthy7/9

వరుణ్ చక్రవర్తి

వరుణ్ చక్రవర్తి.. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా ఈ క్రికెటర్.. 19 టీ20 మ్యాచ్‌లలో 34 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌తో తొలిసారి ఆడనున్నాడు.   

Harshith Rana8/9

హర్షిత్ రానా

హర్షిత్ రానా.. పాక్‌తో ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో అతను రెండో టీ20, పాక్‌తో తొలి మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.   

Jithesh Sharma9/9

జితేష్ శర్మ

జితేష్ శర్మ.. పాక్‌తో మ్యాచ్‌లో ఆడే అవకాశం లేదు. ఎందుకంటే జితేశ్ స్థానంలో సంజూ శాంసన్ వచ్చాడు. జితేశ్ తన కెరీర్ లో ఇప్పటివరకు పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడింది లేదు.