Team India Celebrations: ఆసియా కప్ 2025లో భారత జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో టీమిండియా అద్భుత విజయం సాధించింది. టీమిండియా విన్నింగ్ మూమెంట్ సెలబ్రేషన్స్ ఫొటోలు చూసేయండి..
1/7ఆసియా కప్ 2025లో దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి భారత్ తొమ్మిదోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది.
2/7బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ మాయాజాలం చేయగా.. బ్యాటింగ్‌లో యువ ఆటగాడు తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
3/7147 పరుగుల ఛేజింగ్‌లో టీమిండియా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. 147 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
4/7అభిషేక్ శర్మ (5), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1), శుభ్‌మన్ గిల్ (12) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరడంతో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శాంసన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే (33)తో కలిసి తిలక్ వర్మ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
5/7దూబే కేవలం 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో వేగంగా ఆడి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. చివర్లో దూబే ఔటైనా, తిలక్ వర్మ సంయమనంతో ఆడి జట్టును గెలిపించాడు. రింకూ సింగ్ విన్నింగ్ షాట్ గా ఫోర్ కొట్టడంతో భారత్ టోర్నీ విజేతగా అవతరించింది.
6/7భారత బౌలర్ల సమష్టి ప్రదర్శన, ఆ తర్వాత తిలక్ వర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో టీమిండియా ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. భారత్ ఆసియా కప్ గెలవడం ఇది 9వ సారి.
7/7ఈసారి ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు మూడు సార్లు తలపడగా.. అన్నింటా భారత జట్టే విజయం సాధించింది. ఆసియా కప్ చరిత్రలో భారత్-పాక్ జట్లు ఫైనల్ లో తలపడడం ఇదే మొదటిసారి కాగా, భారత్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.