Add Zee Business As A Preferred Source
App

Venu Swamy on Rashmika Engagement: కలిసుండే యోగం లేదు.!.పెళ్లేందుకు.?.. రష్మిక విజయ్ పెళ్లిపై బాంబు పేల్చిన వేణుస్వామి.!

Written ByInamdar Paresh
Published: Oct 05, 2025, 04:18 PM IST|Updated: Oct 05, 2025, 04:22 PM IST

Rashmika Vijay Engagement: నేషనల్ క్రష్ రష్మిక, విజయ్ దేవర కొండల తమ సన్నిహితులు, ఫ్రెండ్స్ మధ్య ఇటీవల నిశ్చితార్థం వేడుకను నిర్వహించుకున్నారు. దీంతో ఎన్నో రోజుల నుంచి వీరి మధ్య వస్తున్న డేటింగ్ వార్తలకు చెక్ పడ్డట్లైంది.ఈ క్రమంలో జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన కామెంట్స్ ప్రస్తుతం కాంట్రవర్సీగా మారాయి.
 

Rashmika mandanna:1/6

విజయ్ దేవర కొండ:

రష్మిక మందన్న, విజయ్ దేవర కొండల మధ్య ఎన్నో ఏళ్ల నుంచి మంచి లవ్ ట్రాక్ నడుస్తొందని పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా గీతాగోవిందం మూవీలో పడిన ప్రేమ బీజాలు.. డియర్ కామ్రెడ్ తో పెరిగి పెద్ద చెట్టులా మారి ఇద్దరి మధ్య బలమైన బంధం ఏర్పడిందని గత కొన్నేళ్లుగా పుకార్లు షికార్లు చేశాయి.  

rashmika mandanna engagement:2/6

రష్మిక మందన్న పెళ్లి:

ఎక్కడకు వెళ్లిన ఇద్దరు జంటలుగా వెళ్లడం, ఒకేవిధంగా డ్రెస్సింగ్ వేసుకొవడంతో అభిమానులు ఫిక్స్ అయ్యారు. మరోవైపు రష్మిక ప్రతి పండక్కి విజయ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకొవడం, పుష్ప 2 మూవీని విజయ్ ప్యామిలీతో కలిసి చూడటం మొదలైన కారణాలతో ఇంకా వీరిద్దరు పక్కాగా ఒక్కటైపోతారని అందరు ఫిక్స్ అయ్యారు.  

vijay deverakonda:3/6

రష్మిక మందన్న లేటెస్ట్ న్యూస్:

అచ్చం అందరు అనుకున్నట్లు గానే.. రష్మిక, విజయ్ లు ఇటీవల ఎంగెజ్ మెంట్ చేసుకుని  అందరి పుకార్లను నిజం చేశారు. వచ్చే ఏడాదిలో ఫిబ్రవరిలో పెళ్లి బంధంతో వీరిద్దరు ఒక్కటౌతున్నారని సమాచారం. దీనిపై వీరిద్దరు ఇంకా అధికారంగా రియాక్ట్ కాలేదు. ఈ క్రమంలో శుభమా.. అంటూ వీరి ఎంగెజ్ మెంట్ అయ్యిందో లేదో.. అప్పుడు జ్యోతిష్యుడు చేసిన కామెంట్స్ నెట్టింట  కాంట్రవర్సీగా మారాయి.  

rashmika vijay:4/6

వేణుస్వామి:

సెలబ్రీటీల జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. విజయ్ జాతకం గురించి మాట్లాడుతు.. రష్మిక, విజయ్ ల మధ్య పెళ్లి జరిగిన ఎన్నో రోజులు కలిసి ఉండరని బాంబు పేల్చాడు. అంతేకాకుండా గతంలో రష్మిక ఎంగెజ్ మెంట్ క్యాన్షిల్ అయినప్పుడు తాను చెప్పినట్లు చేయడం వల్ల నేషనల్ క్రష్ అయ్యిందన్నాడు..  

venu swamy:5/6

విజయ్ దేవర కొండ:

కానీ విజయ్ తో పెళ్లి వద్దంటే తన మాటను లెక్కచేయడంలేదని వేణుస్వామి చెప్పుకొచ్చారు. వీరి పెళ్లిలో అనేక దోషాలు ఉన్నాయని, దీనితో ఇద్దరు పెళ్లి చేసుకున్న ఆ తర్వాత వివాదాలు చుట్టుముడతాయని వేణు స్వామి చెప్పారు.  

rashmika mandanna marriage date:6/6

రష్మిక మందన్న:

ఒక వేళ నేను చెప్పిన పరిహారాలు చేయించుకుంటే వీరి వైవాహిక జీవితం బాగుంటుందని, చెప్పేవరకు మాత్రమే తన పని అని, ఆతర్వాత ఎవరి కర్మ వారిది అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈక్రమంలో దీనిపై రష్మిక, విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. శుభమా అంటూ ఎంగెజ్ మెంట్  జరిగితే..ఈ అపశకునం మాటలు ఏంటని కూడా వేణుస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో ఎంతో నిజం ఉందో కానీ..ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.