Shani dev Gochar 2025: నవగ్రహాల్లో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రయాణించడానికి దాదాపు రెండున్నరేళ్లు పడుతుంది. తాజాగా ఈయన 27 యేళ్ల తర్వాత భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో కొన్నిరాశుల వారి జీవితం పలు మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి.
1/5Shani dev Gochar:నవగ్రహాల్లో ఏ దేవుడి పేరు చివర ఈశ్వరుడు అని ఉండదు. ఒక్క నవగ్రహాల్లో ఒకటైన శని దేవుడిని మాత్రమే శనీశ్వరుడిగా పిలుస్తుంటారు. ప్రస్తుతం శనీశ్వరడు భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దాదాపు 27 యేళ్ల తర్వాత, శనిదేవుడు భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇవి కొన్ని రాశులకు వారికి అదృష్టం తీసుకురాబోతుంది.
2/5కుంభ రాశి: శనీశ్వరుడి నక్షత్ర మార్పులో కుంభరాశికి అనేక ప్రయోజనాలు కలిగించబోతుంది. మీరు కొత్త ప్రాజెక్టులలో పని చేస్తారు. కొన్ని ముఖ్యమైన పనుల బాధ్యతను మీరు తీసుకుంటారు. ఆర్థికపరమైన లాభాలను అందుకుంటారు. మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
3/5మిథున రాశి: శనీశ్వరుడు నక్షత్ర మార్పుతో మిథున రాశి వారికి శుభ ఫలితాలను అందించబోతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.
4/5మకర రాశి: మకర రాశి అధిపతి శనిదేవుడు. దసరా తర్వాత రోజు శనిదేవుడు సంచారము ఈ రాశిలో జన్మించిన వారికి అనేకమైన ప్రయోజనాలను అందించబోతుంది. కొత్త ఉద్యోగంలో చేరడానికి ఇదే అనువైన సమయం. వ్యాపారం చేయడానికి అనువైన సమయం. కొత్త రంగాల్లో చరిత్ర సృష్టించబోతున్నారు.
5/5గమనిక: ఈ వ్యాసం సాధారణ సమాచారం, మత విశ్వాసాలపై ఆధారపడి ఇవ్వబడింది. జీ న్యూస్ దీనిని ధృవీకరించడం లేదు.