Astrology Today: గ్రహాల్లో గురు గ్రహంతో పాటు కుజ, శుక్ర గ్రహాలు కూడా ఎంతో శక్తిమంతమైనవి. అయితే ఈ గ్రహాల కలయికలో భాగంగా ఈ సారి కుజ, శుక్ర గ్రహాలు కొన్ని రాశీఫలాలకు సిరిసంపదలు తీసుకురానున్నాయి. దీపావళి పండుగ నాడు జరిగే ఈ కలయిక నాలుగు రాశులకు అదృష్టం తీసుకురానుంది. ఆ రాశుల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1/5ప్రతినెలా జరిగే గ్రహాల కలయిక కాదు ఇది. దాదాపుగా 18 సంవత్సరాల తర్వాత కుజ, శుక్ర గ్రహాలు వృశ్చిక రాశిలో కలయిక జరగనుంది. ఎన్నో ఏళ్ల తర్వాత జరగనున్న కలయిక రాశీచక్రంలోని 12 రాశులపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. కానీ, 4 రాశులకు మాత్రం మర్చిపోలేని ఆనందాన్ని, సంతోషాన్ని ఈ కలయిక తీసుకురానుందని సమాచారం.
2/5వృశ్చిక రాశి : కుజ, శుక్ర గ్రహాల కలయిక ఈ వృశ్చిక రాశిలోనే ప్రధానంగా జరగనుంది. కావున ఈ రాశి వాళ్లకు ఊహించని విధంగా అదృష్టం తలుపుతట్టే అవకాశం ఉంది. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగ కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనుకోని విధంగా అవసరానికి డబ్బు చేతికి వస్తుంది. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న తీర్థయాత్రలు ఈసారి తీరనున్నాయి.
3/5కుంభ రాశి : ఈ కలయికతో కుంభ రాశి వారికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. డబ్బుకు ఎలాంటి ఢోకా లేదు.
4/5మీన రాశి : కుజ, శుక్ర గ్రహాల కలయిక వల్ల మీన రాశి వాళ్లకి సంపద పెరుగుతుంది. స్టూడెంట్స్ కు అన్ని విధాలా కలిసి వచ్చే సమయమిది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు వారివారి వృత్తుల్లో ప్రమోషన్స్ అందుకుంటారు. ఆర్థికంగా కూడా బాగా కలిసి వచ్చే సమయమిది.
5/5ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కుజ, శుక్ర గ్రహాల కలయిక ఊహించని ప్రయోజనాలను తెస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అందుకుంటారు.