Add Zee Business As A Preferred Source
App

Govt Pension Scheme: ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ జీవిత భాగస్వామికి ప్రతి నెలా రూ. 5వేలు లభిస్తాయి..!!

Written ByBhoomi
Published: Oct 14, 2025, 08:44 AM IST|Updated: Oct 14, 2025, 08:44 AM IST

Atal Pension Yojana: జీవితాంతం కష్టపడి..రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే.. ఆ బాధను మాటను వర్ణించలేము. అందుకే చాలా మంది సర్వీసులో ఉన్నప్పుడే రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటుంటారు. అంతేకాదు తమ గురించి తమ భాగస్వామి గురించి కూడా ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి కేంద్రంలోని మోదీ సర్కార్ అందిస్తున్న అటల్ పెన్షన్ యోజన ఒక అద్భుతమైన స్కీమ్ అని చెప్పుకోవచ్చు. 

Monthly fixed income in old age1/7

వృద్ధాప్యంలో నెలవారీ స్థిర ఆదాయం

వృద్ధాప్యంలో నెలవారీ స్థిర ఆదాయం కావాలనుకునే అసంఘటిత రంగం ఉద్యోగులకు ఈ పథకం ఒక వరంగా నిలుస్తోంది. ఈ పథకంలో జీవిత భాగస్వామిని చేర్చుకోవడం ద్వారా, పదవీ విరమణ తర్వాత ఆయన లేదా ఆమెకు నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు హామీ ఇచ్చిన పెన్షన్ లభిస్తుంది. కుటుంబానికి భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం అందించాలనుకునే ప్రతి వ్యక్తి ఈ పథకం గురించి తెలుసుకోవాలి.

Regular pension2/7

రెగ్యులర్ పెన్షన్

అటల్ పెన్షన్ యోజనను కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఆధ్వర్యంలో నడుస్తోంది. రెగ్యులర్ పెన్షన్ పొందని వ్యక్తులకు 60 ఏళ్ల తర్వాత స్థిరమైన నెలవారీ ఆదాయం అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే...  ఇది ప్రభుత్వ హామీతో కూడిన పథకం. అంటే మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రభుత్వం హామీ ఇచ్చిన పెన్షన్ మొత్తాన్ని తప్పకుండా అందిస్తుంది.

After retirement3/7

రిటైర్మెంట్ తర్వాత

ఈ పథకంలో మీరు ఎప్పుడు చేరుతారో దాని ఆధారంగా నెలవారీ చందా నిర్ణయిస్తారు. ఉదాహరణకు, 18 సంవత్సరాల వయస్సులో చేరితే మీరు నెలకు రూ.210 చెల్లించాలి. 25 సంవత్సరాల వయస్సులో చేరితే రూ.376, 30 సంవత్సరాల వయస్సులో రూ.577, 40 సంవత్సరాల వయస్సులో అయితే రూ.1,454 చెల్లించాలి. ఈ చందాలను 60 ఏళ్లు వచ్చే వరకు చెల్లిస్తే, రిటైర్మెంట్ తర్వాత మీరు నెలకు రూ.5,000 వరకు పెన్షన్ పొందగలుగుతారు.

Pension for spouse4/7

జీవిత భాగస్వామికి పెన్షన్

ఈ పథకంలో జీవిత భాగస్వామి పేరును చేర్చడం చాలా ముఖ్యమైన అంశం. పెట్టుబడిదారు మరణించిన పక్షంలో, ఆయన/ఆమె జీవిత భాగస్వామికి పెన్షన్ కొనసాగుతుంది. ఇద్దరూ మరణించిన పరిస్థితిలో మొత్తం పెట్టుబడి నామినీకి తిరిగి అందిస్తారు. ఈ విధంగా ఈ పథకం కుటుంబానికి దీర్ఘకాలిక ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా పెన్షన్ పథకాలు లేని ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందినవారు లేదా అసంఘటిత రంగం కార్మికులు దీనివల్ల ఎక్కువ ప్రయోజనం పొందగలరు.

Atal Pension Yojana Form5/7

అటల్ పెన్షన్ యోజన ఫారమ్

అటల్ పెన్షన్ యోజనలో చేరేందుకు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఇప్పటికే ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించే వారు ఈ పథకానికి అర్హులు కాదు. పాన్, ఆధార్, బ్యాంక్ ఖాతా వంటి ప్రాథమిక పత్రాలు తప్పనిసరి. జీవిత భాగస్వామి పేరును చేర్చడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఆఫ్‌లైన్,  ఆన్‌లైన్. ఆఫ్‌లైన్ విధానంలో, మీ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ బ్రాంచ్‌కి వెళ్లి అటల్ పెన్షన్ యోజన ఫారమ్ పూరించాలి. 

 Social Security Schemes 6/7

సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్

దానిలో జీవిత భాగస్వామి పేరు, నామినీ వివరాలు నమోదు చేసి ఆధార్, చిరునామా రుజువు, బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలంటే మీ నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయి Social Security Schemes లేదా APY సెక్షన్‌లో ఫారమ్ నింపి సమర్పించవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు ఎంచుకున్న చందా మొత్తం ప్రతి నెలా ఆటోమేటిక్‌గా మీ ఖాతా నుండి డెబిట్ అవుతుంది.

Atal Pension Yojana7/7

అటల్ పెన్షన్ యోజన

అటల్ పెన్షన్ యోజన ద్వారా వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం, ప్రభుత్వ హామీతో కూడిన భద్రత, జీవిత భాగస్వామికి పెన్షన్ బదిలీ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. చిన్న మొత్తాలతో ప్రారంభించే ఈ పథకం, భవిష్యత్తులో పెద్ద మద్దతుగా నిలుస్తుంది. మీ వయస్సు 40 లోపు ఉంటే ఇప్పుడే ఈ పథకంలో చేరి, మీకూ మీ కుటుంబానికీ ఆర్థిక రక్షణను పొందండి.