ATM Alerts: ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త, లేకపోతే మీ డబ్బులు పోయినట్టే
ఒకవేళ మీరు హ్యాకర్ల వలలో చిక్కుకుపోయుంటే..బ్యాంకు క్లోజ్ అయితే..వెంటనే పోలీసుల్ని సంప్రదించాలి. సాధ్యమైనంత త్వరగా మీ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వడం వల్ల అక్కడి నుంచి ఫింగర్ ప్రింట్స్ లభించవచ్చు. సమీపంలో బ్లూటూత్ కనెక్షన్లు ఏమైనా పనిచేస్తున్నాయా లేదా అనేది తెలుస్తుంది.
కార్డు స్లాట్‌లో కార్డు అమర్చేటప్పుడు అందులో వెలిగే లైట్‌పై దృష్టి పెట్టండి. ఒకవేళ స్లాట్‌లో గ్రీన్ లైట్ ఉంటే..ఏటీఎం సురక్షితమని అర్ధం. కానీ అందులో రెడ్ లేదా మరే ఇతర లైట్ లేకపోతే ఏటీఎం సురక్షితం కాదని అర్ధం.
ఏటీఎంలో వెళ్లినప్పుడు..ఏటీఎం మిషన్ కార్డు స్లాట్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. కార్డు స్లాట్‌లో ఏదైనా సమస్య ఉందని లేదా తేడాగా ఉందని అన్పిస్తే..ఆ స్లాట్ వాడకపోవడం మంచిది.
మీ డెబిట్ కార్డు యాక్సెస్ మొత్తం పొందేందుకు హ్యాకర్లకు మీ పిన్ నెంబర్ తప్పకుండా అవసరమౌతుంది. ఈ పిన్ నెంబర్‌ను హ్యాకర్లు ఏదైనా కెమేరా ద్వారా ట్రాక్ చేస్తారు. అందుకే కెమేరా కంటికి చిక్కకుండా ఉండేందుకు మీరు ఎప్పుడు ఏటీఎంకు వెళ్లినా..పిన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు రెండవచేతితో కప్పాలి. తద్వారా సీసీటీవీ కెమేరాలో చిక్కదు.
హ్యాకర్లు ఏ కస్టమర్ వివరాలైనా ఏటీఎం మెషీన్‌లో కార్డు పెట్టే స్లాట్ నుంచి దొంగిలించే పరిస్థితి ఉంది. ఏటీఎం మెషీన్ కార్డ్ స్లాట్‌లో హ్యాకర్లు రహస్యంగా అమర్చే డివైస్ మీ కార్డు వివరాల్ని స్కాన్ చేస్తుంది. ఆ తరువాత బ్లూ టూత్ లేదా ఇతర వైర్‌లెస్ డివైస్‌తో డేటా దొంగిలిస్తుంది.
కొద్దిపాటి అప్రమత్తత జరగరాని ఘటన నుంచి కాపాడుతుంది. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేముందు అది ఎంతవరకూ సురక్షితమో పరిశీలించడం అవసరం. ఏటీఎంలో అన్నింటికంటే ఎక్కువ రిస్క్ ఉండేది ఏటీఎం కార్డు క్లౌనింగ్‌తో. ఏవిధంగా మీ కార్డు వివరాలు చోరీ అవుతాయో తెలుసుకుందాం..