Add Zee Business As A Preferred Source
App

ATM Pin Safety: ఇది మీ ఏటీఎం నెంబర్ అయితే.. వెంటనే మార్చేయండి.. లేకపోతే సమస్యలే..

Written ByVishnupriya
Published: Sep 07, 2025, 06:30 PM IST|Updated: Sep 07, 2025, 06:30 PM IST

Change ATM Pin: ఈమధ్య ఏటీఎం దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. ఏటీఎం దొంగకు చిక్కితే.. లేకపోతే సైబర్ ఫ్రాద్ లాంటివి చేసే వాళ్లకు దొరికిన.. మనం చిక్కుల్లో పడినట్టే. అయితే చాలామంది ఏముంది వెంటనే బ్లాక్ చేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు.. కానీ మీ ఏటీఎం పిన్ కింద చెప్పే విధంగా ఉంటే మాత్రం.. అలా చేసిన మీరు ప్రమాదంలో పడినట్టే..

ATM Fraud Prevention1/5

ఏటీఎం పిన్ సురక్షా

ఏటీఎం దొంగతనం జరిగినా లేకపోతే ఏటీఎం ఫ్రాడ్ జరిగిన కానీ.. వెంటనే కార్డ్ బ్లాక్ చేస్తే ఏమీ అవ్వడు అనుకుంటారు చాలామంది. కానీ కార్డ్ బ్లాక్ చేసే ముందర.. దొంగకి మీ ఏటీఎం పిన్ దొరికితే మాత్రం ఇక అంతే సంగతి. 

Avoid ATM Scams2/5

ఏటీఎం పిన్ సురక్షా

ఎందుకంటే ఒకసారి డబ్బులు డ్రా చేసిన తర్వాత మనం ఎన్ని కంప్లైంట్లు ఇచ్చిన ఏమి చేయలేము. అందుకే మన ఏటీఎం పిన్ కరెక్ట్ గా పెట్టుకోవడం చాలా ముఖ్యం.   

Change ATM Pins3/5

ఏటీఎం పిన్ సురక్షా

అయితే ఎవరికైనా దొరికిన వెంటనే ట్రై చేసే కొన్ని పిన్స్ ఉంటాయి.. అవి మాత్రం ఏటీఎం పిన్స్ గా పెట్టుకోకూడదు అని సలహా ఇస్తున్నారు బ్యాంకు వాళ్లు. వాటిల్లో ప్రధానంగా వరస సంఖ్య వచ్చే ఏటీఎం పిన్లు పెట్టుకోకూడదు. అంటే 1111,2222,3333,4444 లేదా 1234, 4567, 4321 ఇలా వరస నెంబర్లు వచ్చే పిన్స్ పెట్టుకోకూడదు.

Easy ATM Pins4/5

ఏటీఎం పిన్ సురక్షా

అంతేకాకుండా మన పెళ్లి రోజు లేకపోతే పుట్టిన రోజు.. డేట్లు కూడా ఏటీఎం పిన్స్ గా అసలు పెట్టుకోకూడదు అంట. ఎందుకంటే ఇలాంటి తారీకులు మనం మన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాం.   

Avoid These ATM Pins5/5

ఏటీఎం పిన్ సురక్షా

కాబట్టి ఏటీఎం దొరికిన వాళ్ళు ఇవే ఎక్కువగా ట్రై చేస్తారు అని.. మనం గుర్తుపెట్టుకోడానికి సులభంగా ఉంది కదా అని .. అలాంటివి పిన్స్ పెట్టుకుంటే దొంగలకు మనకై మనమే డబ్బులు ఇచ్చినట్టు అవుతుంది అని చెబుతున్నాయి సర్వేలు. కాబట్టి మీరు ఇలాంటి పిన్ పెట్టుకుంటే వెంటనే మార్చేయండి.