Allu Family: టాలీవుడ్ లో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఊహించని విధంగా అల్లు అరవింద్ ఎదుటే షాకింగ్ కామెంట్లు చేయడం వైరల్ గా మారింది. ఐకాన్ స్టార్ అంటూ ఏమేమో కామెంట్లు చేశారు ఈ నిర్మాత. పూర్తి వివరాల్లోకి వెళితే..
1/5ప్రముఖ నటుడుగా, నిర్మాతగా పేరు సంపాదించిన బండ్ల గణేష్ మళ్లీ చాలాకాలం తర్వాత ఒక సినిమా ఫంక్షన్ లో కనిపించారు. ఇటీవలే భారీ సక్సెస్ అందుకున్న లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్ కి బండ్ల గణేష్ వచ్చారు. ఎప్పటిలాగే అక్కడ తన స్పీచ్ తో అదరగొట్టిన బండ్ల గణేష్ తన మాటలతో కుర్ర హీరో మౌళికి సూచనలు ఇచ్చారు.
2/5వీటికి తోడు అల్లు ఫ్యామిలీ పైన డైరెక్టర్ గానే సెటైర్స్ వేసినట్లుగా కనిపిస్తోంది. ఇండస్ట్రీలో ఒక పెద్దాయన వందల కోట్ల ఆస్తి ఉంది.. ఒక స్టార్ కమెడియన్ కి కొడుకుగా పుడతారు. ఒక మెగాస్టార్ కి బామ్మర్దిగా ఉంటారు. ఒక ఐకాన్ స్టార్ కి తండ్రిగా ఉంటారు..
3/5ఆయన ఎవరికి అందుబాటులో ఉండరు. ఆయన ఎవరికి అందుబాటులో ఉండాలో వారికే ఉంటారు. అది జీవితమంటే.. అంటూ అల్లు అరవింద్ ముందే మాట్లాడారు. తన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకున్నారు అల్లు అరవింద్.. అంటూ బాంబు పేల్చారు బండ్ల గణేష్.
4/5సినిమాని ఎంత అభినందించారో .. బన్నీ వాసు మీరు ఎంత కష్టపడినా కూడా చివరికి ఆ క్రెడిట్ అల్లు అరవింద్ సినిమా అంటున్నారు. అది ఆయన అదృష్టం.. మీ బ్యాడ్ లక్ నేనేం చెప్పలేనంటూ బండ్ల గణేష్ మాట్లాడారు.
5/5ఆయన ఏమి చేయరు.. కేవలం చివరిలో వచ్చి చిన్న నవ్వు నవ్వి పేరు కొట్టేస్తారు అంటూ బండ్ల గణేష్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. నవ్వకండి సార్ ఇది వాస్తవం మీ షర్టు నలగదు, మీ హెయిర్ స్టైల్ మారదు, మీ మనసు నలగదు మీరు మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు..అది మీ అదృష్టం దానికి ఎవరేం చేయలేరంటూ బండ్ల గణేష్ చేశారు.