All Banks Holiday For 18 Days Across India Of October: 2025 క్యాలెండర్‌లో మరో నెల ముగిసి కొత్త నెల వస్తోంది. సెప్టెంబర్ నెల ముగిసిపోతుండగా.. అక్టోబర్ రాబోతున్నది. మరి ఈ నెలలో ప్రత్యేకతలు.. పండుగలతోపాటు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి. ముఖ్యంగా బ్యాంకుల సెలవులు తెలుసుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1/6ప్రస్తుత 2025 క్యాలెండర్‌లో సెప్టెంబర్ నెల ముగుస్తోంది. అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. కొత్త నెల ప్రారంభమవుతుందంటే ఆ నెలలో జరిగే పండుగలు, ఉత్సవాలతోపాటు సెలవులు తెలుసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా బ్యాంకుల సెలవులు తెలుసుకుంటే అవసరం లేకున్నా అవగాహన ఉండాలి. మరి అక్టోబర్ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులో తెలుసుకుందాం.
2/6సెప్టెంబర్ నెలలో అనూహ్యంగా బ్యాంకులకు భారీ సెలవులు వచ్చాయి. ఈ నెలలో అన్ని పండుగలు ఉండడంతోపాటు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఉత్సవాలు ఉండడంతో భారీగా సెలవులు రాగా.. అదే స్థాయిలో అక్టోబర్ నెలలో కూడా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
3/6అక్టోబర్ 2025 సెలవులకు సంబంధించి ఇప్పటికే ఆర్‌బీఐ జాబితా విడుదల చేసింది. ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం బ్యాంకులకు మొత్తం 18 రోజుల సెలవులు వస్తున్నాయి. జాతీయ పండుగలతోపాటు స్థానిక సంప్రదాయాలు, ఉత్సవాలను కలుపుకుని దేశమంతటా 18 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే ఆయా ప్రాంతాలను బట్టి సెలవులు ఉండవచ్చు.. ఉండకపోవచ్చు.
4/6యథావిధిగా ఆదివారం (5, 12, 19, 26)తోపాటు రెండో, నాలుగో శనివారాలు (4, 25) బ్యాంకులు మూసి ఉండనున్నాయి. అక్టోబర్‌లోనే అతి పెద్ద పండుగలు దసరాతోపాటు దీపావళి వచ్చింది. ఆ తర్వాత అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రాగా.. దసరా కూడా అదే రోజు వచ్చింది. దీంతో బ్యాంకులకు ఒక సెలవు పోయినట్టు అయ్యింది.
5/6అక్టోబర్ 21వ తేదీన దీపావళి పండుగ సెలవు. ఈ రోజు దాదాపుగా భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మహార్నవమి, గోవర్ధన పూజ, విక్రమ సంవత్ నూతన సంవత్సరం, ఆయుత పూజ, విశ్వకర్మ దినం, ఛత్ పూజ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వంటి వివిధ ప్రత్యేక దినాల సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే ఈ సెలవులు దేశవ్యాప్తంగా ఉండవు.
6/6అక్టోబర్ నెలలో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవు ఉందని ముందే తెలుసుకుంటే బ్యాంకు లావాదేవీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక వేళ బ్యాంకు సెలవులు ఉన్న సమయంలో బ్యాంకు లావాదేవీలు చేయాలంటే ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం తదితర మార్గాల ద్వారా చేయవచ్చు. డిజిటల్ లావాదేవీలతో బ్యాంకులకు వెళ్లనవసరం లేదు.