Add Zee Business As A Preferred Source
App

Bank Holiday Today: మొంథా కారణంగా ఈరోజు బ్యాంకులకు సెలవు ఉందా.. ఎక్కడెక్కడ అంటే..?

Written ByVishnupriya
Published: Oct 27, 2025, 07:28 AM IST|Updated: Oct 27, 2025, 07:28 AM IST

Bank Holiday 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.. ఈరోజు నుంచి మొంథా అనే తుపాను ముప్పు దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు నుంచి ఏకంగా మూడు రోజుల పాటు.. పాఠశాలకు సెలవు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎన్నో జిల్లాలలో ఈ సెలవు కొనసాగనుండి.. ఈ క్రమంలో బ్యాంకులకు కూడా సెలవు ఉందా అనే వివరాల్లోకి వెళితే..

Banks Holiday For 3 Days1/6

ఆంధ్రప్రదేశ్ సెలవులు,

ఈరోజు తేదీ 27 అక్టోబర్ 2025..సోమవారం…మొంథా అనే తుపాను ముప్పు.. వల్ల ఆంధ్రప్రదేశ్లో కృష్ణ, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో పాఠశాలకు సెలవు ప్రకటించారు ప్రభుత్వం. ఈ తుఫాను మూడు రోజుల పాటు కొనసాగుతూ ఉండటంతో.. ఈ మూడు రోజుల్లో కూడా పిల్లలకు సెలవు ఉందనుంది. 

Banks Motha Holidays 2/6

మొంథా తుపాను బ్యాంకు సెలవు,

ఈ క్రమంలో ఈ తుఫాను కారణంగా బ్యాంకులకు కూడా సెలవు ఉందా అనే సందేహం ఎంతోమందిలో మొదలైంది. బ్యాంకులకు కూడా మూడు రోజుల పాటు సెలవులు ఇస్తే ఎలా అనే కంగారు కూడా ఎంతోమందిలో ఉంది. 

Motha Cyclone Holidays 3/6

బ్యాంకులకు ఈరోజు సెలవు,

అయితే ఈ సెలవులు బ్యాంకులకు వర్తించవు. ఈ మూడు రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాలలో మాత్రం.. ఈరోజు కొన్ని దగ్గర్లో బ్యాంకులకు సెలవు ఉంది.

Bank Holiday Areas 4/6

ఆంధ్రప్రదేశ్ బ్యాంకు సెలవులు,

దీపావళి తరువాత జరిగే ముఖ్యమైన పండుగ అయిన ఛఠ్ పూజ.. కొన్ని రాష్ట్రాలలో కొనసాగుతోంది. ఈ పండుగ నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. ప్రస్తుతం ఈ పండుగకు మూడో రోజు. ఈ సందర్భంలో కొన్ని రాష్ట్రాలలో పాఠశాలలు, కార్యాలయాలు, అలాగే బ్యాంకులకు కూడా సెలవు ఉంటుంది. 

Holiday Due To Chhatha Pooja5/6

ఛఠ్ పూజ

ఛఠ్ పూజ ప్రధానంగా బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ఈరోజు సాయంత్రం సంధ్యా అర్ఘ్యం కార్యక్రమం ఉండడంతో ఈ మూడు రాష్ట్రాలలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఆ రాష్ట్రాలలో బ్యాంకు పనులు ఈరోజు ఉండవు.

Bank Holiday Update 6/6

నేటి బ్యాంక్ హాలిడే

మిగతా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు సాధారణ రోజులలానే పనిచేస్తాయి. కనుక ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఏ సమస్య లేకుండా బ్యాంక్ పనులు చేసుకోవచ్చు.