Add Zee Business As A Preferred Source
App

Bank Holiday: రేపు మంగళవారం బ్యాంకులకు సెలవు.. కారణమేమిటంటే..?

Written ByAruna Maharaju
Published: Oct 20, 2025, 05:26 PM IST|Updated: Oct 20, 2025, 05:26 PM IST

Tuesday Bank Holiday 2025: అక్టోబర్‌ నెలలో బ్యాంకులకు మొత్తం సెలవులే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఫెస్టివల్స్, నేషనల్ హాలీడేస్ కారణంగా.. దాదాపు ఈ నెల మొత్తం బ్యాంకులకు సెలవులే ఉన్నాయి. అందుకే వినియోగదారులు తమ బ్యాంక్ ఏయే రోజుల్లో తెరిచి ఉంటుందో తెలుసుకొని.. ముందుగానే ప్లానింగ్ చేసుకోవడం మంచిది. అయితే రేపు అనగా అక్టోబర్ 21న మంగళవారం బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.   

Bank Holidays Tomorrow1/5

అక్టోబర్ లో బ్యాంకులకు సెలవులు

కొన్ని చోట్ల బ్యాంకులకు సెలవులు అనేవి అక్కడ జరుపుకునే పండుగలపై ఆధారపడి ఉంటాయి. అయితే.. కొన్ని రాష్ట్రాలు సోమవారం దీపావళిని జరుపుకుంటుండగా.. రేపు మంగళవారం మరికొన్ని రాష్ట్రాల్లో దీపావళిని చేసుకుంటున్నారు. 

Bank Holidays October2/5

బ్యాంకులకు సెలవులు

ఈ ఏడాదిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో దీపావళిని మంగళవారం జరుపుకుంటున్నారు. అందుకే బ్యాంకు సెలవుల విషయంలో కొద్దిగా గందరగోళం ఏర్పడింది.   

Bank Holiday3/5

రేపు బ్యాంకులకు సెలవు

దీపావళి అమావాస్య, దీపావళి, గోవర్ధన్ పూజల సందర్భంగా ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అక్టోబర్ 21, 2025 మంగళవారం బ్యాంకులు మూతపడతాయి.    

October 21 Bank Holiday4/5

బ్యాంకులకు సెలవు

అక్టోబర్ 21, మంగళవారం రోజున బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, గాంగ్‌టక్, ఇంఫాల్, జమ్మూ, ముంబై, నాగ్‌పూర్, రాయ్‌పూర్, శ్రీనగర్‌లోని బ్రాంచ్‌లు.. దీపావళి అమావాస్య, గోవర్ధన్ పూజ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.

Diwali 2025 Bank Holidays5/5

రేపు మంగళవారం బ్యాంకులకు సెలవు

అయితే బ్యాంకులకు సెలవు ఉన్నప్పుడు కంగారు పడాల్సిన పనిలేదు.  ఆన్‌లైన్‌లో అన్ని బ్యాంకింగ్ ఆపరేషన్స్అందుబాటులో ఉంటాయి. ATMల నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.  అలాగే నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI లావాదేవీలు ఎప్పుడూ పనిచేస్తాయి. దీంతో బ్యాంక్ హాలిడేస్ టైమ్‌లో కూడా మన ఆర్థిక లావాదేవీలు ఆగవు.